Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాజస్థానీ స్పెషల్ చుర్మా లడ్డూ..100% స్వచ్ఛమైన దేశీయ స్వీట్..ఈజీగా చేసుకోండిలా..
పండుగలు, పెళ్లిళ్లు, పూజలు లేదా ఏ శుభకార్యమైనా సరే రాజస్థానీ ఇళ్లలో చుర్మా లడ్డూ లేనిదే ఆ వేడుక పూర్తికాదు. మట్టి వాసనను తలపించే దీని సహజమైన రుచి, స్వచ్ఛమైన నెయ్యి సువాసన ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. సాధారణ స్వీట్లలా కాకుండా చుర్మా లడ్డూలు పూర్తిగా దేశీయ,సహజమైన పదార్థాలతో తయారవుతాయి.
ఇందులో ఎటువంటి కృత్రిమ రంగులు గానీ, నిల్వ ఉంచే రసాయనాలు గానీ ఉండవు. ఈ లడ్డూలు తక్షణ శక్తిని, సంతృప్తిని ఇస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చుర్మా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
రవ్వ: అర కప్పు
శనగ పిండి: పావు కప్పు
నెయ్యి: పావు కప్పు (పిండిలో కలపడానికి),మరో పావు కప్పు (బెల్లం
పాకానికి)
బెల్లం తురుము: 2 కప్పులు
నీళ్లు: పిండి కలపడానికి
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు,బాదం,కిస్మిస్): తగినన్ని
గసగసాలు: 1-2 టీస్పూన్లు
యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, రవ్వ, శనగపిండి, పావు కప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. పిండి మిశ్రమం చేతితో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గట్టి పిండిలా కలుపుకోవాలి.
-కలిపిన పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసి, చేతి పిడికిలితో ఒత్తుతూ స్థూపాకారపు బాల్స్ గా చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. మంటను తక్కువలో పెట్టి ఈ పిండి బాల్స్ ను గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు నిదానంగా వేయించాలి. ఇలా చేయడం వల్ల పిండి లోపలి వరకు బాగా ఉడుకుతుంది. వేయించిన తర్వాత వాటిని పక్కన పెట్టి చల్లార్చాలి.
-చల్లారిన బాల్స్ ను చిన్న ముక్కలుగా విరిపి, మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో మిగిలిన నెయ్యి, తురిమిన బెల్లం వేసి చిన్న మంటపై కరిగించాలి. బెల్లం కరిగి నురుగు రావడం మొదలవ్వగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మనం సిద్ధం చేసుకున్న చుర్మా పొడిలో వేయాలి. ఇందులోనే వేయించిన డ్రై ఫ్రూట్స్, గసగసాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
-మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులతో గట్టిగా ఒత్తుతూ గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే రాజస్థానీ సంప్రదాయ చుర్మా లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications