Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక!
ఎండాకాలంలో ఉదయం నుంచే భగభగ మండే సూర్యుడు, చెమటలతో శరీరం అలసిపోతుంది. ఏ పని చేసినా వెంటనే నీరసం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో మనసు ఏదైనా చల్లగా, తీయగా తినాలని ఆరాటపడుతుంది. ఆ సమయంలో అందరికీ గుర్తొచ్చే అద్భుతమైన రుచి కుల్ఫీ. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి, మనసును ఉత్తేజపరచడానికి కుల్ఫీ ఒక అమృతంలా పనిచేస్తుంది.
అయితే బయట మార్కెట్లో దొరికే కుల్ఫీల్లో కృత్రిమ రంగులు, కల్తీ పదార్థాలు ఉంటాయనే భయం మనల్ని వెనక్కి లాగుతుంది. మరి అదే కుల్ఫీని, ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే? అందులోనూ ప్రత్యేకమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ అయితే ఆ మజానే వేరు. మట్టి కుండలో తయారైన ఈ కుల్ఫీ అందించే కమ్మటి సువాసన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రీమీ రుచి ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. మట్టి కుండలో గడ్డకట్టడం వల్ల ఆ మట్టికి ఉండే సహజమైన సువాసన కుల్ఫీకి పడుతుంది.

రాజస్థానీ మట్కా కుల్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
ఫుల్ క్రీమ్ పాలు - 1 లీటరు
మావా (కోవా) - 250 గ్రాములు
చక్కెర - అర కప్పు
కస్టర్డ్ పౌడర్ - 4 టీస్పూన్లు
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష - ఒక్కొక్క టేబుల్ స్పూన్
యాలకుల పొడి - అర టీస్పూన్
రాజస్థానీ మట్కా కుల్ఫీ తయారీ విధానం
-ముందుగా మందపాటి అడుగున్న గిన్నె తీసుకుని ఫుల్ క్రీమ్ పాలు పోయాలి. మీడియం మంట మీద పాలను వేడి చేస్తూ అందులో చక్కెర, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేయాలి. పాలు అడుగు పట్టకుండా గరిటెతో తిప్పుతూ 15 నిమిషాల పాటు చిక్కబడేలా మరిగించాలి.
-మరుగుతున్న పాల నుండి కొద్దిగా పాలను ఒక కప్పులోకి తీసుకోండి. అందులో కస్టర్డ్ పౌడర్ వేసి, ఎలాంటి ఉండలు లేకుండా మెత్తని మిశ్రమంగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న పాలలో మావా వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం కాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఒక్కసారి బ్లెండ్ చేయాలి. ఇలా చేస్తే కుల్ఫీ టెక్స్చర్ చాలా క్రీమీగా, మృదువుగా మారుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మట్టి కుండల్లో (మట్కాల్లో) పోసి, ఫాయిల్ తో కవర్ చేసి డీప్ ఫ్రిజ్‌లో 4-5 గంటల పాటు ఉంచాలి.
-కుల్ఫీకి మరింత ఘాటైన రుచి కావాలంటే కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కలపవచ్చు. కాస్త కుంకుమపువ్వు వేస్తే రుచితో పాటు మంచి రంగు వస్తుంది. మట్టి కుండలు లేకపోతే, స్టీల్ గ్లాసులు లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ వాడుకోవచ్చు. సర్వ్ చేసేముందు పైన పిస్తా పప్పులు చల్లితే రుచి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications