Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే బేకరీ స్టైల్ ఐస్ క్రీం..ఎలాగంటే?
ఎండాకాలం వచ్చిందంటే..భానుడి భగభగలకు ఎవరికైనా సరే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఎండల తీవ్రతకు శరీరం అలసిపోయినప్పుడు గొంతు తడుపుకోవడానికి చల్లని జ్యూస్ లు, రిఫ్రెష్ అయ్యే డ్రింక్స్ తాగాలని కోరుకుంటాం. ముఖ్యంగా మండుటెండలో మనసుకు ఉపశమనం కలిగించే ఐస్ క్రీంలు అంటే ఇష్టపడని వారుండరు. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే ఐస్ క్రీం కోసం చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
సాధారణంగా ఐస్ క్రీంలను మనం బయట కొనుగోలు చేస్తుంటాం. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా, బయట బేకరీల్లో దొరికే ఐస్ క్రీం కంటే ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీంను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ సమయంలో, కేవలం ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే టేస్టీ ఐస్ క్రీం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
చిక్కటి పాలు - ఒక లీటరు
చక్కెర - అర కప్పు
కస్టర్డ్ పౌడర్ - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, బాదం, పిస్తా లేదా బెర్రీలు - అలంకరణ కోసం
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక లీటరు చిక్కటి పాలను పోసి నెమ్మదిగా మరిగించాలి. పాలు అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి.
-పాలు మరుగుతున్న సమయంలో ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ వేయాలి. దానికి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కలిపి, ఎలాంటి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని స్టవ్ పై మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ సమయంలో మంటను సిమ్ లో ఉంచాలి. పాలు కొద్దిగా చిక్కబడటం ప్రారంభించిన తర్వాత, అందులో అర కప్పు చక్కెర వేయాలి.
-చక్కెర పూర్తిగా కరిగే వరకు సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు గరిటెతో వదలకుండా కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కటి క్రీమ్ లా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-కస్టర్డ్ మిశ్రమం చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు ఆ క్రీమ్ ను మిక్సీ జార్ లో వేసి సుమారు ఒక నిమిషం పాటు బ్లెండ్ చేయాలి. ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ రుబ్బుకోవడం వల్ల ఐస్ క్రీం చాలా మృదువుగా వస్తుంది.
-ఆ తర్వాత ఆ క్రీమ్ ను గాలి చొరబడని ఒక కంటైనర్ లో లేదా టీ కప్పులు, ఇడ్లీ కప్పులలో పోసుకోవాలి. దీనిని ఒక రాత్రంతా లేదా కనీసం 8-10 గంటల పాటు ఫ్రిజ్ ఫ్రీజర్ లో ఉంచాలి.
-మరుసటి రోజు ఉదయం ఫ్రీజర్ నుంచి బయటకు తీస్తే.. ఎంతో మృదువైన, నోరూరించే ఐస్ క్రీం రెడీ. దీనిని ఒక బౌల్లోకి తీసుకుని, పైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ లేదా బెర్రీలతో గార్నిష్ చేసి ఇస్తే క్షణాల్లో ఖాళీ అయిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications