Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
వర్షం పడుతున్న సాయంత్రం వేడి వేడి టీ సిప్ చేస్తూ, దానికి తోడుగా కరకరలాడే బిస్కెట్ కొరుకుతుంటే ఆ అనుభూతే వేరు. ఉదయం నిద్రలేచిన వెంటనే అయినా, లేదా సాయంత్రం అలసట తీర్చే టీ టైమ్ అయినా.. బిస్కెట్లు లేనిదే ఆ సమయం అసంపూర్ణంగానే అనిపిస్తుంది.
మార్కెట్లో ఎన్ని రకాల బిస్కెట్లు దొరికినా, మన చేతులతో మన ఇంట్లో తాజాగా చేసుకున్న బిస్కెట్ల రుచి, అవి బేక్ అవుతున్నప్పుడు ఇల్లంతా వ్యాపించే కమ్మని సువాసన ఏ బేకరీలోనూ దొరకవు. వెన్న కమ్మదనం, జీలకర్ర ఘాటైన సువాసన కలగలిపి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే కరకరలాడే జీరా బిస్కెట్లను మీ ఇంట్లోనే అత్యంత సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

జీరా బిస్కెట్ల తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
వెన్న (బటర్) - అర కప్పు
పొడి చక్కెర - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
ఉప్పు - అర టీస్పూన్
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
చల్లని పాలు - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
జీరా బిస్కెట్ల తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకోండి. అందులో జీలకర్ర వేసి సన్నని మంట మీద ఒకటి లేదా రెండు నిమిషాల పాటు దోరగా వేయించండి. కమ్మని సువాసన రాగానే స్టవ్ ఆపేయండి. చల్లారాక, అందులో సగం జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. మిగిలిన సగం పక్కన ఉంచండి.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో మెత్తగా ఉన్న వెన్న, పొడి చక్కెర వేయండి. ఒక బీటర్ సహాయంతో సుమారు 3-4 నిమిషాల పాటు బాగా గిలకొట్టండి. ఈ మిశ్రమం నురగలా, చాలా తేలికగా, క్రీమీగా మారాలి. బిస్కెట్లు గుల్లగా రావడానికి ఈ స్టెప్ చాలా ముఖ్యం.
-ఇప్పుడు ఈ క్రీమ్ మిశ్రమంలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల చల్లని పాలు పోస్తూ పిండిని ముద్దలా చేయండి. చపాతీ పిండిలా గట్టిగా అస్సలు పిసకకూడదు, చేతివేళ్లతో సున్నితంగా ముద్దలా దగ్గరకు చేర్చాలి.
-ఇలా సిద్ధం చేసుకున్న పిండి ముద్దను ఒక ప్లాస్టిక్ చుట్టి లేదా మూతపెట్టి 15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. దీనివల్ల బిస్కెట్లు అద్భుతమైన క్రంచీగా వస్తాయి.
-15 నిమిషాల తర్వాత పిండిని బయటకు తీసి, సుమారు పావు అంగుళం (1/4 inch) మందంతో చపాతీలా ఒత్తుకోండి. కుకీ కట్టర్ లేదా మూత సహాయంతో మీకు నచ్చిన ఆకారంలో బిస్కెట్లను కత్తిరించండి. వీటి పైన పక్కన ఉంచుకున్న వేయించిన జీలకర్ర గింజలను అద్ది, సున్నితంగా నొక్కండి.
-ఓవెన్ ను ముందుగానే 170 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. బేకింగ్ ట్రేలో కత్తిరించిన బిస్కెట్లను పేర్చి ఓవెన్ లో 15-18 నిమిషాల పాటు బేక్ చేయండి. బిస్కెట్లు లేత బంగారు రంగులోకి మారగానే బయటకు తీయండి.
-బయటకు తీసిన వెంటనే బిస్కెట్లు కొద్దిగా మెత్తగా అనిపించినా, పూర్తిగా చల్లారిన తర్వాత కరకరలాడుతూ తయారవుతాయి. చల్లారిన ఈ బిస్కెట్లను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
