Latest Updates
-
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.!
రొటీన్ కాఫీకి గుడ్ బై చెప్పండి.. ఈ టేస్టీ అండ్ హెల్తీ బనానా కాఫీ ట్రై చేయండి!
మీ రెగ్యులర్ కాఫీకి భిన్నంగా, రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే పానీయాన్ని ట్రై చేయాలని అనుకున్నారా? అయితే బనానా కాఫీ మీకు బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక డ్రింక్ పేరు మార్మోగిపోతోంది. ప్రముఖ మాస్టర్ చెఫ్ కునాల్ కపూర్..ఎవరైనా సరే తమ ఇంట్లోనే అత్యంత సులభంగా తయారు చేసుకోగల అద్భుతమైన బనానా కాఫీ రెసిపీని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

బనానా కాఫీ తయారీకి కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు - 2
ఇన్ స్టంట్ కాఫీ పొడి - 2 టీస్పూన్లు
చల్లగా కాచి చల్లార్చిన పాలు - 1 గ్లాసు (సుమారు 200 ml)
చక్కెర లేదా తేనె లేదా బెల్లం పొడి -సరిపడా
చల్లటి నీరు - పావు కప్పు
ఐస్ క్యూబ్స్ - 5 లేదా 6
బనానా కాఫీ తయారీ విధానం
ముందుగా రెండు బాగా పండిన అరటిపండ్ల తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఒక బ్లెండర్ (మిక్సీ జార్) లో వేయండి. ఇందులో ఒక గ్లాసు చల్లటి పాలు, మీకు కావలసినంత తీపి కోసం కొద్దిగా పంచదార లేదా తేనె వేసి మెత్తగా క్రీమీగా అయ్యేలా బ్లెండ్ చేసుకోండి.
ఇప్పుడు ఒక చిన్న గిన్నె లేదా కప్పు తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఇన్ స్టంట్ కాఫీ పొడి వేయండి. దానిపై చల్లటి నీళ్లు పోసి, కాఫీ పొడి పూర్తిగా కరిగిపోయేలా ఒక స్పూన్ తో బాగా కలపండి.
ఒక సర్వింగ్ గ్లాస్ లో ముందుగా 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ వేయండి. ఆ ఐస్ క్యూబ్స్ పైన ముందుగా నీళ్లలో కలిపి పెట్టుకున్న ఇన్ స్టంట్ కాఫీ మిశ్రమాన్ని పోయండి. ఇప్పుడు ఆ కాఫీ మిశ్రమం పైన తయారు చేసుకున్న క్రీమీ బనానా షేక్ ను నెమ్మదిగా ఒక పొరలాగా పోయండి.
అంతే చల్లటి, రుచికరమైన కోల్డ్ బనానా కాఫీ మీ ఇంట్లోనే రెడీ. దీని పైన అలంకరణ కోసం కొద్దిగా కోకో పౌడర్ లేదా దాల్చిన చెక్క పొడిని చల్లుకుంటే రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి.
బనానా కాఫీ - పోషక విలువల ఖజానా
ఒక గ్లాసు బనానా కాఫీలో (పాలతో కలిపి) సుమారుగా ఈ క్రింది పోషకాలు
లభిస్తాయి.
కేలరీలు: 160 - 200 kcal
కార్బోహైడ్రేట్లు: 30 - 35 గ్రాములు
ప్రోటీన్: 6 - 8 గ్రాములు
పొటాషియం: 450 - 500 మిల్లీగ్రాములు
ఫైబర్: 3 - 4 గ్రాములు
కెఫిన్: 70 - 100 మిల్లీగ్రాములు
విటమిన్లు: విటమిన్ C, విటమిన్ B6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
బనానా కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా కాఫీలోని కెఫిన్ వల్ల మెదడు ఉత్తేజితమై తక్షణమే చురుకుదనం వస్తుంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ బనానా కాఫీలో అరటిపండు ఉండటం వల్ల, అందులోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి స్థిరమైన, సుదీర్ఘమైన శక్తిని ఇస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇది తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
చాలామంది ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు. కానీ కాఫీని అరటిపండుతో కలిపి తీసుకున్నప్పుడు ఆ సమస్య ఉండదు. అరటిపండులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపులో మంటను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
జిమ్‌కు వెళ్లేవారికి లేదా వ్యాయామం చేసేవారికి బనానా కాఫీ ఒక బెస్ట్ డ్రింక్. వ్యాయామానికి అరగంట ముందు దీన్ని తాగితే, కాఫీలోని కెఫిన్ ఏకాగ్రతను పెంచి అలసటను తగ్గిస్తుంది, అరటిపండులోని గ్లూకోజ్ కండరాలకు శక్తినిస్తుంది. అలాగే వర్కౌట్ తర్వాత తాగితే, కండరాల నొప్పులు తగ్గి త్వరగా రికవరీ అవ్వడానికి ఇందులోని మెగ్నీషియం, ప్రోటీన్ సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications