Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బంజారా చికెన్ కబాబ్ ఎప్పుడైనా తిన్నారా? చూస్తేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయా, ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి
చికెన్ తో బోలెడు వెరైటీ వంటలను చేయవచ్చు. ఒక్కో చికెన్ రెసిపికి ఒక్కో ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. అయితే మీరెప్పుడైనా చికెన్ తో తయారుచేసే బంజారా కబాబ్ తిన్నారా? చాలామంది మందు తాగేటప్పుడు స్టఫ్ లోకి దీన్ని తింటుంటారు. ఇది బంజారా తెగ యొక్క సాంప్రదాయ వంటకాలలో ఒకటి. మసాలా దినుసులతో కూడిన ఒక ప్రత్యేకమైన మారినేడ్లో చికెన్‌ను ఊరబెట్టి, ఆపై కాల్చి దీనిని తయారు చేస్తారు. టేస్ట్ అత్యధ్భుతంగా ఉంటుంది.
బంజారా చికెన్ కబాబ్ ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ రాదు. కొలతల ప్రకారం తగిన పద్దతిలో దీన్ని వండితే మీ ప్లేట్ లో ముక్క మిగలకుండా తినేస్తారు. బంజారా చికెన్ కబాబ్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బంజారా చికెన్ కబాబ్ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ - 500 గ్రాములు (బోన్‌లెస్, చిన్న ముక్కలుగా కట్
చేసుకోవాలి)
కారం - 1 టీస్పూన్ (లేదా రుచికి తగినట్లుగా)
ఉప్పు - రుచికి తగినట్లుగా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1/4 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొంచెం
పెరుగు - 1/2 కప్పు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేథి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేసుకోండి,అద్భుతమైన రుచి
బంజారా చికెన్ కబాబ్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేథి, పసుపు పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
-తర్వాత చిన్నగా కట్ చేసిన బోన్ లెస్ చికెన్ ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దీంతో మసాలా చికెన్ కు బాగా పడుతుంది. దీనిని కనీసం 2 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టండి
-తర్వాత ఒక స్కీవర్ పై మారినేట్ చేసిన చికెన్ ముక్కలను గుచ్చండి.
-ఇప్పుడు గ్రిల్ పాన్ లేదా ఓవెన్‌ను వేడి చేయండి.
-స్కీవర్ లను గ్రిల్ పాన్ లేదా ఓవెన్‌పై ఉంచండి. చికెన్ ముక్కలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు, పూర్తిగా ఉడికే వరకు కాల్చండి. ఓవెన్లో కబాబ్‌లను తయారు చేస్తుంటే ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయండి, 20-25 నిమిషాలు కాల్చండి.
-మధ్యమధ్యలో ఆయిల్ ని బ్రష్ చేయండి, స్కీవర్లను తిప్పుతూ ఉండండి..దీంతో చికెన్ అన్ని వైపులా సమానంగా ఉడుకుతుంది.
-బంజారా చికెన్ కబాబ్ లను కొత్తిమీరతో గార్నిష్ చేసి, పుదీనా చట్నీ లేదా మీకు నచ్చిన డిప్‌తో వేడిగా సర్వ్
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications