Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
వేసవి ఎండల్లో చల్ల చల్లని ఐస్ క్రీమ్ తినాలని అనిపించడం చాలా సహజం. ముఖ్యంగా చాలామంది చిన్న పిల్లలు అయితే ఎండాకాలంలో రోజూ ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తుంటారు. అయితే బయట కొనుగోలు చేసే ఐస్ క్రీమ్ లు ఆరోగ్యానికి మంచివి కావు. బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లలో రంగులు, రసాయనాలు, కృత్రిమ రుచులు నిండి ఉంటాయి.

ఇంట్లోనే సమ్మర్ లో లభించే పచ్చి మామిడికాయలో ఎలాంటి కల్తీ లేకుండా, సహజసిద్ధంగా చల్లని ఐస్ క్రీమ్ తయారుచేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, మండే ఎండల నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి తిన్నారంటే, మీరే కాదు పిల్లలు కూడా వేళ్లు నాకాల్సిందే.
పచ్చి మామిడి ఐస్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు - 2
పంచదార - రుచికి తగినంత
నీళ్లు - తగినన్ని
ఆకుపచ్చ రంగు (ఫుడ్ కలర్) - చిటికెడు
కారం పొడి - కొద్దిగా
బ్లాక్ సాల్ట్-కొద్దిగా
పచ్చి మామిడి ఐస్ క్రీమ్ తయారీ విధానం
-ముందుగా రెండు తాజా పచ్చి మామిడికాయలను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. వాటి కాడలను కత్తిరించి, పీలర్ సహాయంతో పైన ఉన్న చెక్కును పూర్తిగా తీసేయాలి.
-ఇప్పుడు మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. లోపల ఉన్న టెంకను తీసేసి, ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తరిగిన పచ్చి మామిడి ముక్కలు, తగినంత పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. మీ ఐస్ క్రీమ్ అచ్చం బయట కొన్నట్లే ఆకర్షణీయమైన రంగులో కనిపించాలంటే, ఇందులో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. ఇది చూసేందుకు మరింత నోరూరించేలా చేస్తుంది.
-తయారైన మామిడి మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ (అచ్చులు) లో పోయాలి. పైన ఐస్ క్రీమ్ పుల్లలను గుచ్చాలి. మీ దగ్గర అచ్చులు లేకపోతే, ఇంట్లో ఉండే చిన్న స్టీలు గ్లాసులు లేదా పేపర్ కప్పులను కూడా వాడుకోవచ్చు.
-ఈ అచ్చులను ఫ్రీజర్ లో పెట్టి కనీసం 6 నుంచి 8 గంటల పాటు లేదా రాత్రంతా అలాగే ఉంచాలి.
-బాగా గడ్డకట్టిన తర్వాత ఫ్రీజర్ నుంచి ఆ చల్లని ఐస్ క్రీమ్ లను బయటకు తీయండి. ఇప్పుడు ఆ పుల్లపుల్లని, తియ్యతియ్యని ఐస్ క్రీమ్ పైన కొద్దిగా కారం పొడి, కొంచెం నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) చల్లి రుచి చూడండి. ఆ కారం, పులుపు, ఉప్పు, తీపి.. ఈ నాలుగు రుచులు మీ నోట్లో కరిగిపోతుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications