Latest Updates
-
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
వేసవి ఎండల్లో చల్ల చల్లని ఐస్ క్రీమ్ తినాలని అనిపించడం చాలా సహజం. ముఖ్యంగా చాలామంది చిన్న పిల్లలు అయితే ఎండాకాలంలో రోజూ ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తుంటారు. అయితే బయట కొనుగోలు చేసే ఐస్ క్రీమ్ లు ఆరోగ్యానికి మంచివి కావు. బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లలో రంగులు, రసాయనాలు, కృత్రిమ రుచులు నిండి ఉంటాయి.

ఇంట్లోనే సమ్మర్ లో లభించే పచ్చి మామిడికాయలో ఎలాంటి కల్తీ లేకుండా, సహజసిద్ధంగా చల్లని ఐస్ క్రీమ్ తయారుచేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, మండే ఎండల నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి తిన్నారంటే, మీరే కాదు పిల్లలు కూడా వేళ్లు నాకాల్సిందే.
పచ్చి మామిడి ఐస్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు - 2
పంచదార - రుచికి తగినంత
నీళ్లు - తగినన్ని
ఆకుపచ్చ రంగు (ఫుడ్ కలర్) - చిటికెడు
కారం పొడి - కొద్దిగా
బ్లాక్ సాల్ట్-కొద్దిగా
పచ్చి మామిడి ఐస్ క్రీమ్ తయారీ విధానం
-ముందుగా రెండు తాజా పచ్చి మామిడికాయలను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. వాటి కాడలను కత్తిరించి, పీలర్ సహాయంతో పైన ఉన్న చెక్కును పూర్తిగా తీసేయాలి.
-ఇప్పుడు మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. లోపల ఉన్న టెంకను తీసేసి, ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తరిగిన పచ్చి మామిడి ముక్కలు, తగినంత పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. మీ ఐస్ క్రీమ్ అచ్చం బయట కొన్నట్లే ఆకర్షణీయమైన రంగులో కనిపించాలంటే, ఇందులో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. ఇది చూసేందుకు మరింత నోరూరించేలా చేస్తుంది.
-తయారైన మామిడి మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ (అచ్చులు) లో పోయాలి. పైన ఐస్ క్రీమ్ పుల్లలను గుచ్చాలి. మీ దగ్గర అచ్చులు లేకపోతే, ఇంట్లో ఉండే చిన్న స్టీలు గ్లాసులు లేదా పేపర్ కప్పులను కూడా వాడుకోవచ్చు.
-ఈ అచ్చులను ఫ్రీజర్ లో పెట్టి కనీసం 6 నుంచి 8 గంటల పాటు లేదా రాత్రంతా అలాగే ఉంచాలి.
-బాగా గడ్డకట్టిన తర్వాత ఫ్రీజర్ నుంచి ఆ చల్లని ఐస్ క్రీమ్ లను బయటకు తీయండి. ఇప్పుడు ఆ పుల్లపుల్లని, తియ్యతియ్యని ఐస్ క్రీమ్ పైన కొద్దిగా కారం పొడి, కొంచెం నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) చల్లి రుచి చూడండి. ఆ కారం, పులుపు, ఉప్పు, తీపి.. ఈ నాలుగు రుచులు మీ నోట్లో కరిగిపోతుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
