Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పాలు,పంచదార లేకుండానే..కొబ్బరి చిప్పలోనే ఐస్ క్రీమ్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వేసవి కాలంలో చల్లగా, తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఐస్ క్రీం మొదటి ఛాయిస్. అయితే బరువు పెరుగుతామనే భయం లేదా డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది దీనికి దూరంగా ఉంటారు. అందుకే ఎటువంటి పంచదార, క్రీమ్ లేదా పాలు లేకుండా, కేవలం సహజ సిద్ధమైన పదార్థాలతో కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకోండి.
పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. పైగా దీని తయారీలో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసేవే. సాధారణ ఐస్ క్రీంలలో ఉండే అనారోగ్యకరమైన కొవ్వులు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇందులో ఉండవు. దీని తయారీకి పెద్దగా సమయం కూడా పట్టదు, చిటికెలో రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీ కోకోనట్ ఐస్ క్రీంని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి కొబ్బరి
-అరటికాయ
-తేనె
-జీడిపప్పు
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి,కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రౌండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను ఒక గుడ్డలో వేసుకొని గిన్నెలోకి పిండుకోవాలి. పిప్పెను పడుసుకోండి. మార్కెట్లో దొరికే కొబ్బరి పాల కంటే ఇంట్లో తయారు చేసుకున్న తాజా కొబ్బరి పాలు వాడితేనే రుచి అద్భుతంగా ఉంటుంది.
-పిండగా వచ్చిన కొబ్బరి పాలను మిక్సీ గిన్నెలో వేసి, ఇందులోనే 10 జీడిపప్పు పలుకులు, 1 అరటికాయ ముక్కలు, 1 స్పూన్ తేనె వేసి గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఖాళీ కొబ్బరి చిప్పలో పోసి 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంతే కోకోనట్ ఐస్ క్రీం రెడీ.
-తినడానికి 5 నిమిషాల ముందు ఫ్రిజ్ నుండి బయటకు తీస్తే, అది కొంచెం మెత్తబడి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications