Latest Updates
-
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు!
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే!
వేసవికాలం వచ్చేసింది. ఈ ఎండల తీవ్రతకు శరీరం త్వరగా అలిసిపోతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే ఏదైనా తీపి పదార్థం తినాలని చాలామందికి అనిపిస్తుంటుంది. కానీ బరువు పెరుగుతామనే భయంతో ఆగిపోతారు. అయితే సత్తు లడ్డూలు మీకు బెస్ట్ ఆప్షన్. వేసవిలో వేయించిన శెనగలతో చేసే సత్తుని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరానికి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది.

సత్తులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, వడదెబ్బ తగలకుండా శరీరాన్ని రక్షిస్తుంది. సాధారణ స్వీట్ల వలె ఇందులో అధిక కేలరీలు ఉండవు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం చూస్తున్నవారికి సత్తు ఒక అద్భుతమైన ఆహారం.
సత్తు లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
-సత్తు పిండి
-నెయ్యి
-బాదం
-జీడిపప్పు
-పిస్తా
-ఎండుద్రాక్ష
-పుచ్చకాయ గింజలు
-యాలకల పొడి
-బెల్లం తురుము
సత్తు లడ్డూ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెడు సత్తు పిండిని తీసుకోండి. సత్తును ఇప్పటికే వేయించిన శనగలతో తయారు చేస్తారు కాబట్టి దీనిని పచ్చివాసన పోయేదాకా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టి, కేవలం ఒక చెంచా లేదా మీకు సరిపడా కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి వేసి సన్నని మంటపై సత్తు పిండిని దోరగా వేయించండి. కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆపేయండి.
-వేయించిన సత్తు పిండి పూర్తిగా చల్లారిన తర్వాత, దానిని ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చుకోండి. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, పుచ్చకాయ గింజలు వేసి బాగా కలపండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి అదనపు బలాన్ని, అద్భుతమైన క్రంచీ రుచిని ఇస్తాయి.
-ఇవి ఆరోగ్యకరమైన లడ్డూలు కాబట్టి మనం తెల్ల పంచదారకు బదులుగా మంచి నాణ్యమైన బెల్లం తురుమును లేదా ఖర్జూర పొడిని కలుపుకోవచ్చు. పటిక బెల్లం వాడినా చలవ చేస్తుంది. అలాగే మంచి సువాసన, రుచి కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని చేత్తో బాగా కలపండి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టాలి. పిండి పొడిపొడిగా ఉండి ముద్దగా రాకపోతే, దానికి బైండింగ్ కోసం కాచి చల్లార్చిన పాలు లేదా ఇంకొద్దిగా కరిగించిన నెయ్యిని కొద్దికొద్దిగా చిలకరిస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న లడ్డూలుగా, తినడానికి వీలుగా గుండ్రంగా చుట్టుకోండి.
-అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువైన, ఆరోగ్యకరమైన సత్తు లడ్డూలు రెడీ. వీటిని మీరు ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు స్నాక్ గా తినవచ్చు. పిల్లలు వీటి రుచిని ఎంతగానో ఇష్టపడతారు. స్కూల్ కి వెళ్లే పిల్లల లంచ్ బాక్స్ లో ఈ లడ్డూలను పెట్టి ఇవ్వడం వల్ల, వారికి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి కావాల్సిన శక్తి అందుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications