Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జలుబు, దగ్గుకు దివ్యౌషధం..చలికి చెక్ పెట్టే చికెన్ పెప్పర్ రసం..ఎలా చేసుకోవాలంటే..
శీతాకాలం వచ్చేసింది. చల్లటి గాలి ఒంటిని తాకుతూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, కానీ కాస్త గజగజ వణికించేలా ఉంది. ఇలాంటి సమయంలో మనసు వేడివేడిగా, ఘాటుగా ఏదైనా తినాలని, తాగాలని కోరుకుంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటివి పలకరించే ఈ రోజుల్లో వంటింట్లో చేయాల్సిన ఒక అద్భుతమైన వంటకమే చికెన్ పెప్పర్ రసం.
కేవలం రుచి మాత్రమే కాదు, ఇది మీ ఒంటికి వెచ్చదనాన్ని అందించి, జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. వేడి వేడి అన్నంలో ఈ రసం కలుపుకుని, ఒక ముద్ద తిని చూడండి ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. చికెన్ పెప్పర్ రసం ఎలా తయారు చేయాలో చూడండి.
కావలసిన పదార్థాలు
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
ధనియాలు: 1 టీస్పూన్
కరివేపాకు: ఓ రెమ్మ
పండిన టమోటాలు: 3
పసుపు: అర టీస్పూన్
రసం తయారీ కోసం:
నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర: 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 7-8
ఎండు మిర్చి: 2
పచ్చిమిర్చి: 2
కరివేపాకు: రెండు రెమ్మలు
బోన్ లెస్ చికెన్: 250 గ్రాములు
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
చింతపండు రసం: అర కప్పు
నీరు: 3-4 కప్పులు
కొత్తిమీర: సన్నగా తరిగినది
తయారీ విధానం
-ముందుగా పొయ్యి మీద ఒక చిన్న బాండీ పెట్టి అందులోమిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేయండి. సన్నని మంట మీద దోరగా వేయించుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో టమోటా ముక్కలు, పసుపు వేసి మెత్తటి గుజ్జులా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు పొయ్యి మీద లోతైన గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
-ఆ తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించాక శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-చికెన్ రంగు మారే వరకు సుమారు 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసి పచ్చి వాసన పోయే వరకు మరో నిమిషం పాటు వేయించి, రుబ్బిన టమోటా గుజ్జు, చింతపండు రసం పోసి చక్కగా కలపండి.
-ఇప్పుడు అవసరమైనన్ని నీళ్లు పోసి గిన్నెపై మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికి, రసం రుచులన్నీ పీల్చుకునే వరకు 10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
-పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. నూనె పైకి తేలుతూ, ఘుమఘుమలాడే వాసనతో రసం రెడీగా ఉంటుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైనుంచి చల్లి, ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే వేడివేడి, ఘాటైన, ఆరోగ్యకరమైన చికెన్ పెప్పర్ రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









