Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
లంచ్ బాక్సుకు పర్ఫెక్ట్.. ఆరోగ్యంతో కూడిన బీట్రూట్ బూందీ రైస్..చేసుకోవడం చాలా సింపుల్
కొత్తగా టేస్టీగా ఏదైనా సింపుల్ గా ఉండే రైస్ ఐటమ్ ట్రై చేద్దామనుకుంటున్నారా? అయితే ఓ సారి బీట్రూట్ బూందీ రైస్ తప్పక ట్రై చేయండి. ఇది లంచ్ బాక్సులకు లేదా మధ్యాహ్న భోజనానికి చాలా మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. బీట్రూట్ నచ్చని వారు కూడా ఈ విధంగా చేస్తే ఇష్టపడతారు. పిల్లలు కూడా దీనిని లొట్టలేసుకుంటూ తింటారు. ఇందులో వాడే పదార్థాల వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా దీనిని ట్రై చేయవచ్చు. దీని తయారీకి వంటగదిలో రెగ్యులర్ గా ఉండే పదార్థాలు సరిపోతాయి. బీట్రూట్ బూందీ రైస్ ని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బీట్రూట్
-బూందీ
-నెయ్యి
-ఆయిల్
-పచ్చిమిర్చి
-మిరియాలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-కొత్తిమీర తరుగు
-బిర్యానీ ఆకు
-ఉల్లిపాయ
-జీలకర్ర పొడి
-పసుపు
-కారం
-ఉప్పు
-గరం మసాలా
-ధనియాల పొడి
-కసూరి మేథీ
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-బియ్యం
-నిమ్మరసం

బీట్రూట్ బూందీ రైస్ తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కప్పు బియ్యాన్ని(190గ్రా) శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి.
-తర్వాత 150 గ్రాముల బీట్రూట్ ని చెక్కు తీసి తురుముకోవాలి. బీట్రూట్ తురుము కప్పు ఉండాలి.
-తర్వాత స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర వేసి చిట్లనిచ్చాక అర టీస్పూన్ మిరియాలు, 3 లవంగాలు, 3 యాలకలు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు వేసి వేయించాక ఇందులోని 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి ఇవి లేత బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించాలి.
-ఉల్లిపాయ రంగు మారాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేదాకా వేయించి 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు బీట్రూట్ తురుము అందులో వేయండి. బీట్ రూట్ పచ్చి వాసన పోయేదాకా మీడియం మంట మీద వేయించాలి. బీట్రూట్ మెత్తగా మగ్గకూడదు.
-బీట్రూట్ బాగా వేగాక అందులో 1 టీస్పూన్ వేపిన జీలకర్ర పొడి,1 టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, ముప్పావు టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ వేయించిన ధనియాల పొడి,రుచికి సరిపడా ఉప్పు, 1టేబుల్ స్పన్ కసూరి మేథీ వేసి బాగా వేయించాక బీట్రూట్ లో నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపండి.
-4-5 నిమిషాలకు బియ్యంలోని చెమ్మ ఆరి అడుగు పడుతుంది. అప్పుడు కొత్తిమీర తరుగు కూడా అందులో చల్లి కలిపి అందులో 3 కప్పుల వేడి నీళ్లు పోసి, అరచెక్క నిమ్మరసం కూడా అందులో పిండి బాగా కలిపి కొత్తిమీర తరుగు చల్లి మూతపెట్టి పెద్ద మంట మీద విజిల్స్ రానివ్వాలి.
-స్టవ్ ఆపేసిన 20 నిమిషాల తర్వాత మూత తీసి అందులో అరకప్పు బూందీ వేసి కలుపుకోండి. వేడి వేడిగా దీన్ని తింటుంటే స్వర్గం కనబడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications