Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బరువు తగ్గాలన్నా,ఆరోగ్యంగా ఉండాలన్నా బీట్ రూట్ చపాతీ బెస్ట్..ఎలా చేసుకోవాలంటే
ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీట్ రూట్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ బీట్ రూట్ తో అనేక రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. అయితే బీట్ రూట్ తో చపాతీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? రెగ్యులర్ గా తినే చపాతీలు బోర్ అనిపిస్తే ఓసారి ఈ బీట్ రూట్ చపాతీ ట్రై చేయండి. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది, ముఖ్యంగా పిల్లలు, బీట్ రూట్ తినడానికి ఇష్టపడని వారికి ఇది ఒక గొప్ప మార్గం. బీట్ రూట్ చపాతీని మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
బీట్ రూట్ చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బీట్ రూట్
-అల్లం
-ఆయిల్
-గోధుమ పిండి
-పచ్చిమిర్చి

బీట్ రూట్ చపాతీ తయారీ విధానం
-ముందుగా ఒక బీట్ రూట్ తీసుకొని దానిపైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత ఈ ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే 4 చిన్న అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్,గ్రైండ్ చేసిన బీట్ రూట్ పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. నీళ్లు పోసుకోకూడదు.
-మెత్తగా కలిపిన పిండిమీద మూతపెట్టి పావుగంట సేపు పక్కన పెట్టుకోండి.
-తర్వాత పిండిని కొంచెం తీసుకొని దాని పొడి పిండిలో డిప్ చేసి తీసి దాన్ని చపాతీ కర్రతో రౌండ్ గా వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేశాక దానిమీద వత్తుకున్న చపాతీని వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చపాతీ మీద కొంచెం ఆయిల్ వేసి కూడా కాల్చుకోవచ్చు. అంతే బీట్ రూట్ చపాతీ రెడీ.
ప్రయోజనాలు
బీట్ రూట్ లో సహజ చక్కెరలు, నైట్రేట్లు ఉంటాయి..ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి.. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. ఇది కాలేయంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో బీట్ రూట్ సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications