Just In
- 8 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 9 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 10 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 11 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
బేసన్ లడ్డూ రెసిపి
అన్ని పండగలకు చేసుకునే సెనగ లడ్డూ ఉత్తరాది వారి ప్రత్యేక వంటకం. దీన్ని సెనగపిండిని నేతిలో వేయించి, అందులో చక్కెర, ఏలకుల పొడిని, డ్రైఫ్రూట్లను కలిపి చేస్తారు.
సెనగలడ్డూలను తమిళంలో కడలై మావు ఉరుండై అని అంటారు. ఇంట్లో ఫంక్షన్లకి చేసుకోదగ్గ ఈ వంటకం చాలా సులువైనది, అస్సలు శ్రమలేనిది. అందుకే పార్టీలకి ఇది ప్రసిద్ధమైనది.
నెయ్యి వలన కొంచెం మెరుస్తూ ఉండే ఈ లడ్డూ, సెనగపిండి వాసన వల్ల మీరు మరింత అడుగుతూ తింటారు.మీరు దీన్ని ఇంట్లో తయారుచేసుకోవాలనుకుంటే, ఈ చిత్రాలు, వీడియోతో కూడిన వ్యాసాన్ని చదివి తయారీవిధానం నేర్చుకోండి.
Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: 8 లడ్డూలు
-
పంచదార పొడి - 1కప్పు
సెనగపిండి - 2 కప్పులు
నెయ్యి - ¾ కప్పు
నీళ్ళు - 3 చెంచాలు
ఏలకుల పొడి - చిటికెడు
తరిగిన బాదం - 1 చెంచా + అలంకరణకి
తరిగిన పిస్తాపప్పు - 1 చెంచా + అలంకరణకి
-
1. వేడిపెనంలో నెయ్యి వేయండి.
2. సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి.
3. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.
4. నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు.
5. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి.
6. గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.
7.పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి.
8. ఏలకుల పొడిన్ వేసి కలపండి.
9. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి.
10.ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.
11. సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి.
12.ఈ లడ్డూలను తరిగిన బాదం, పిస్తాపప్పులతో అలంకరించండి.
- 1. నెయ్యి, సెనగపిండిల నిష్పత్తి సరిగ్గా ఉండాలి.
- 2. లడ్డూ మిశ్రమంలో ఏలకుల పొడిని కలిపినప్పుడు కొంత తీసుకుని మీ అరచేతుల మధ్యలో రాసుకోండి. మీకు నెయ్యి తగిలితే ఇక అది పూర్తయ్యినట్టే.
- వడ్డించే పరిమాణం - 1లడ్డూ
- క్యాలరీలు - 135 క్యాలరీలు
- కొవ్వు - 7గ్రాములు
- ప్రోటీన్ - 7గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 29గ్రాములు
- చక్కెర - 12 గ్రాములు
- ఫైబర్ - 6గ్రాములు
స్టెప్ బై స్టెప్ - సెనగపిండి లడ్డూ తయారుచెయ్యటం ఎలా
1. వేడిపెనంలో నెయ్యి వేయండి.
2. సెనగపిండి వేసి మాడకుండా కలుపుతూనే ఉండండి.
3. సెనగపిండి రంగు కొంచెం మారి, పచ్చి వాసన పోయేవరకూ 10 నిమిషాలు కలుపుతూనే ఉండండి.
4. నీళ్ళు చల్లితే పైన నురగను గమనించవచ్చు.
5. నురగ పోయే వరకు కలుపుతూనే ఉండండి.
6. గిన్నెలోకి దాన్ని మార్చి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.
7.పంచదార పొడిని వేసి మళ్ళీ బాగా కలపండి.
8. ఏలకుల పొడిన్ వేసి కలపండి.
9. తరిగిన బాదం, పిస్తాలను చెంచాడు వేసి కలపండి.
10.ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టండి.
11. సమాన సైజులలో గుండ్రటి లడ్డూలలా చేసుకోండి.
12.ఈ లడ్డూలను తరిగిన బాదం, పిస్తాపప్పులతో అలంకరించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.