Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
చపాతీ,బగారా రైస్ లోకి అదిరిపోయే చికెన్ చాప్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే కేవలం ఒక ఆహారం కాదు, అది ఒక ఎమోషన్. ఆదివారం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటా చికెన్ ఘుమఘుమలు రావాల్సిందే. కొందరికి అయితే డైలీ నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే సాధారణంగా మనం చికెన్ కర్రీ, ఫ్రై, చికెన్ 65, చికెన్ సాంబార్ వంటివి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం.
కానీ ఎప్పుడూ ఒకే రుచి కాకుండా కాస్త కొత్తగా, స్పైసీగా, జ్యూసీగా తినాలనిపిస్తే మాత్రం చికెన్ చాప్స్ బెస్ట్ ఆప్షన్. పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. చికెన్ చాప్స్ అనేది చపాతీ, పరోటా, రోటీ, పుల్కా, రాగి ముద్ద లేదా బగారా రైస్..దేనిలోకైనా అద్భుతమైన కాంబినేషన్. అద్భుతమైన రుచితో, చాలా సులభంగా మన ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు
-చికెన్
-ఉల్లిపాయలు
-టమోటా
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-పుదీనా ఆకులు
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చి కొబ్బరి తురుము
-దాల్చిన చెక్క
-లవంగాలు
-ఏలకులు
-సోంపు
-నల్ల మిరియాలు
-జీడిపప్పు
-పసుపు
-ధనియాల పొడి
-వంట నూనె
-రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, మిరియాలు, సోంపు వంటి మసాలా దినుసులు వేయాలి.
-మసాలా దినుసులు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, టమోటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు బాగా వేయించాలి.
-ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కలపాలి. ఆ తర్వాత రుచిని పెంచే జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చికెన్ చాప్స్ రుచి అంతా మనం తయారు చేసే మసాలా పేస్ట్ లోనే ఉంటుంది.
-పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో తగినంత నూనె పోయాలి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి వేయించాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పు జత చేయాలి.
-చికెన్ లోని నీరు బయటకు వచ్చి అది పూర్తిగా ఆవిరైపోయే వరకు బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది.
-చికెన్ వేగిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి, అందులో ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మరో 2 నిమిషాలు ఉడికించాలి.
-చివరగా కాస్త కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి కుక్కర్ మూత పెట్టేయండి.
-మీడియం మంట మీద సుమారు 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేయండి.
-కుక్కర్ లోని ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే.. ఘుమఘుమలాడే దాబా స్టైల్ చికెన్ చాప్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications