Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
నిమ్మకాయ పచ్చిమిర్చి ఊరగాయ..పెరుగన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్
భారతీయ వంటకాల్లో ముఖ్యంగా తెలుగు వారి భోజనంలో ఊరగాయకు ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకం. ఏ కూర ఉన్నా, లేకపోయినా, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పక్కన ఊరగాయ ఉంటే ఆ తృప్తే వేరు. మన సంప్రదాయ ఊరగాయలలో నిమ్మకాయ పచ్చిమిర్చి ఊరగాయ చాలా రుచికరమైనది, ఆరోగ్యకరమైనది కూడా.
నిమ్మకాయలోని పులుపు, పచ్చిమిర్చిలోని ఘాటు కలిసి దీనికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఆవకాయలో నూనె ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ పచ్చడిని చాలా తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చిమిర్చి ఊరగాయ కొన్ని నెలల పాటు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నిమ్మకాయలు: 10 - 12
పచ్చిమిరపకాయలు: 100-150 గ్రా
కల్లు ఉప్పు: 3-4 టేబుల్ స్పూన్లు
పసుపు: 1 టీస్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
వేయించి పొడి చేసిన మెంతి పిండి: అర టీస్పూన్
ఇంగువ: చిటికెడు.
నూనె: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: అదనంగా 3-4 నిమ్మకాయల రసం
తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయలను, పచ్చిమిరపకాయలను నీటితో శుభ్రంగా కడిగాక ఒక పొడి వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. తుడిచిన తర్వాత ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టండి.
-ఇప్పుడు నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-పచ్చిమిరపకాయల తొడిమలు తీసేసి వాటిని నిలువుగా చీల్చుకోవాలి.
-ఇప్పుడు ఒక పొడి గాజు సీసా లేదా జాడీని తీసుకోండి. అందులో కోసి ఉంచుకున్న నిమ్మకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. దీనిపై పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమంలో అదనంగా తీసి పెట్టుకున్న 3-4 నిమ్మకాయల రసాన్ని పిండాలి. ఈ రసం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడతాయి, పచ్చడి జ్యూసీగా ఉంటుంది.
-ఇప్పుడు మూత పెట్టి ఈ సీసాను 3- 4 రోజుల పాటు పక్కన పెట్టాలి. రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు పొడి గరిటెతో ముక్కలను పైకి కిందకి కలుపుతూ ఉండాలి. దీనివల్ల ఉప్పు, పులుపు ముక్కలకు బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత నిమ్మకాయ తొక్క మెత్తబడుతుంది.
-కొంతమంది దీనిని ఇలాగే తింటారు. కానీ రుచిని పెంచడానికి పోపు(తాలింపు) పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఒక చిన్న బాండీలో నూనె వేడి చేయాలి.
-నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత అందులో మెంతి పొడి వేసి ఊరిన పచ్చడిలో కలపాలి.
-ఇప్పుడు రుచికరమైన, ఘాటైన నిమ్మకాయ పచ్చిమిర్చి ఊరగాయ రెడీ. దీనిని పెరుగన్నంతో గానీ, ఉప్మాతో గానీ తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications