Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదిరిపోయే గోంగూర కారం..ఇలా చేస్తే అద్భుతం
తెలుగు వారి వంటగదిలో గోంగూరకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. అందుకే దీనిని ముద్దుగా ఆంధ్రా మాత అని పిలుచుకుంటారు. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర మటన్..ఇలా ఏది చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే గోంగూరతో చేసుకునే మరో అద్భుతమైన వంటకం గోంగూర కారం పొడి.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, గోంగూర కారం వేసుకుని తింటే ఆ రుచే వేరు. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా నంచుకోవచ్చు. రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ గోంగూర కారం పొడి ముందుంటుంది. గోంగూర కారం పొడి కొన్ని నెలల పాటు నిల్వ ఉండేలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఎర్ర గోంగూర: 4-5 పెద్ద కట్టలు
ఎండుమిర్చి: 15-20
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
మెంతులు: అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 15-20
కరివేపాకు: 2 రెమ్మలు
నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
ఎండు కొబ్బరి: చిన్న ముక్క
తయారీ విధానం
-ముందుగా గోంగూర ఆకులను కాడలు లేకుండా తుంచుకోవాలి. ఆకులను నీటిలో శుభ్రంగా కడిగి, ఒక పొడి వస్త్రంపై లేదా నీడలో ఆరబెట్టాలి. ఆకుల్లో తడి అస్సలు ఉండకూడదు.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి. చివరగా కరివేపాకు వేసి, అది కరకరలాడే వరకు వేయించి పక్కన ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో మరో 2 స్పూన్ల నూనె వేసి, ఆరబెట్టుకున్న గోంగూర ఆకులను వేయాలి. గోంగూర ఆకు మెత్తబడి, అందులోని నీరంతా ఆవిరైపోయే వరకు వేయించాలి. ఆకు దగ్గరగా ముద్దలా అయ్యేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, మసాలా దినుసులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బరకగా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు ఆ పొడిలో వెల్లుల్లి రెబ్బలు,వేయించి పెట్టుకున్న గోంగూరను వేసి దీనిని మరీ పేస్ట్ లా కాకుండా పల్స్ మోడ్ లో ఒకటి రెండు సార్లు తిప్పాలి. గోంగూర, కారం పొడి బాగా కలిసేలా చూసుకోవాలి. రోటిలో దంచుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.
-తయారైన పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. తడి తగలకపోతే ఇది బయట 1-2 నెలల వరకు, ఫ్రిజ్ లో ఉంచితే 3-4 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
