Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
దోశ, ఇడ్లీ రుచిని రెట్టింపు చేసే మధురై స్పెషల్ టమాటో తన్నీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ప్రతిరోజూ ఉదయం చాలా మంది ఇళ్లలో తరచుగా ఇడ్లీలు, దోశలు వేస్తుంటారు. అయితే వీటిలోకి సైడ్ డిష్‌గా ఏం చేస్తున్నాం అన్నదే అసలైన ప్రశ్న. రోజూ రొటీన్ గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తిని తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా తమిళనాడులోని మధురై వీధుల్లో ఫేమస్ అయిన టమాటో తన్నీ చట్నీ ట్రై చేయండి.
తన్నీ చట్నీ అంటే కొంచెం పల్చగా, నీళ్ళలా ఉండే కమ్మటి చట్నీ అన్నమాట. ఇది వేడి వేడి ఇడ్లీలలోకి ఎంత బాగుంటుందంటే, సాంబార్ లేకపోయినా సరే ఇడ్లీలు లాగించేస్తారు. ఇంట్లో ఉండే ఉల్లి, టమాటో, ఎండుమిర్చితో కేవలం 10-15 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. నోరూరించే మధురై స్పెషల్ చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నీళ్లు - 2 కప్పులు
ఎండు మిరపకాయలు - 10
టమోటాలు - 2
ఉల్లిపాయలు - 3
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో సుమారు 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు మరుగుతుండగా అందులో ఎండు మిరపకాయలు, టమోటాలు అలాగే వేయండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. వీటిని సుమారు 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి.
-టమోటాల పై తొక్క విడిపోవడం ప్రారంభమైనప్పుడు, అవి బాగా ఉడికాయని అర్థం. వెంటనే స్టవ్ ఆపివేసి, నీళ్లను వంపేసి (ఈ నీళ్లను పారబోయకండి, చట్నీలో వాడుకోవచ్చు) ఉల్లి, టమాటో, మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత, టమోటాల పైనున్న తొక్కను తీసేయాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉడికించిన ఎండు మిరపకాయలను వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకున్నాక అందులోనే తొక్క తీసిన టమోటాలు, ఉడికించిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. దీనిని మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా, కొంచెం బరకగా అంటే కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
-మిక్సీ పట్టిన మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి.
-చివరిగా తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి చిటపటలాడించి ఆ తాలింపును చట్నీలో కలపండి. అంతే గుమగుమలాడే మధురై టమాటో చట్నీ రెడీ.
-ఈ చట్నీని వేడి వేడి ఇడ్లీలపై పోసుకుని తింటుంటే ఆ రుచే వేరు. ఇడ్లీతో మాత్రమే కాదు, దోశ, ఊతప్పం, పొంగల్ వంటి వాటితో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications