Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మైదా లేకుండా ఆరోగ్యంగా..నోరూరించే రవ్వ మోమోస్ ఎలా చేసుకోవాలంటే..
సాయంత్ర సమయాల్లో వీధి చివర్లో లేదా రోడ్డు పక్కనో మోమోస్ బండి కనిపిస్తే మనకు నోట్లో నీళ్లూరుపోతుంటాయి. అంతలా ఈ టిబెటన్ వంటకం భారతీయుల మనసు గెలుచుకుంది. ఆవిరిపై ఉడికించే వంటకం కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, బయట దొరికే మోమోలలో వాడే మైదా పిండి, క్వాలిటీ లేని పదార్థాల పట్ల చాలామందికి ఆందోళన ఉంటుంది.
అయితే మైదాకు బదులుగా రవ్వను వాడి ఇంట్లోనే హెల్దీ మోమోస్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. రుచితో పాటు ఆరోగ్యం కూడా అందించే హెల్దీ మోమోస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ: రెండున్నర కప్పులు
నూనె: 2 టీస్పూన్లు
ఉప్పు: చిటికెడు
స్టఫింగ్ కోసం
సోయా గ్రాన్యూల్స్ (సోయా రవ్వ): 1 కప్పు
పనీర్:250 గ్రాములు
ఉల్లిపాయ: 1
క్యాబేజీ తురుము: 1 కప్పు
క్యారెట్ తురుము: అర కప్పు
క్యాప్సికమ్: అర కప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్
సోయా సాస్
వెనిగర్
మిరియాల పొడి
కారం
ఉప్పు
నూనె
స్పైసీ చట్నీ కోసం
టమోటా:1
ఎండుమిర్చి: 5-6
వెల్లుల్లి రెబ్బ: 1
ఉప్పు: 1 టీస్పూన్
వెనిగర్: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా బొంబాయి రవ్వను జల్లెడ పట్టి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
-ఆ తర్వాత ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన రవ్వ పొడి, ఉప్పు, నూనె వేసి, గోరువెచ్చని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి గుడ్డతో కప్పి పక్కన పెట్టండి.
-ఈలోగా చట్నీ తయారీకోసం మిక్సీ గిన్నెలో మోటా, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుంటే స్పైసీ మోమోస్ చట్నీ రెడీ.
-ఇప్పుడు మోమోస్ లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం..ముందుగా సోయా గ్రాన్యూల్స్ ను వేడి నీటిలో 5 నిమిషాలు నానబెట్టి మెత్తబడ్డాక నీళ్లు గట్టిగా పిండేయాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి ముక్కలు వేగనిచ్చాక ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు అందులో సోయా గ్రాన్యూల్స్, తురిమిన పనీర్ వేసి 5-8 నిమిషాలు వేగనివ్వాలి.
-చివరగా అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి మిశ్రమం చల్లారనివ్వాలి.
-ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా పల్చగా ఒత్తుకోవాలి. అంచులు పల్చగా, మధ్యలో కాస్త మందంగా ఉండాలి. మధ్యలో సోయా-పనీర్ మిశ్రమాన్ని ఉంచి, అంచులను దగ్గరకు చేర్చి మోమోస్ ఆకారంలో మడిచి సీల్ చేయాలి.
-ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్ లో నీళ్లు పోసి వేడి అయ్యాక మోమోలను ఆవిరిపై 10-15 నిమిషాలు ఉడికించాలి. అంతే వేడి వేడి ప్రోటీన్ రిచ్ మోమోస్ రెడీ. వీటిని స్పైసీ టమోటా చట్నీతో సర్వ్ చేస్తే, పిల్లల నుండి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications