Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
స్పైసీ మసాలా లస్సీ..సూపర్ టేస్ట్ ఉంటుంది..ఎలా చేసుకోవాలంటే
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ భానుడి భగభగలు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. వర్షం పడుతున్నంతసేపే చల్లదనం తర్వాత మళ్లీ ఎండతో చుక్కలు కనబడుతున్నాయి. ఆ ఊరు, ఈ ఊరు అని తేడా అని ఇది ఎండాకాలమా, వానాకాలమా అన్నట్లు ఉంది పరిస్థితి. అయితే ఎండ దెబ్బకు చల్లగా, రిఫ్రెష్ గా ఏదైనా తాగాలనిపిస్తోందా? అయితే, తీపి లస్సీకి బదులుగా ఈసారి ఘాటుగా, రుచికరంగా ఉండే మసాలా లస్సీని ట్రై చేయండి.
తియ్యటి పానీయాలు ఇష్టపడని వారికి ఇది ఒక వరం లాంటిది. చిక్కటి పెరుగు, ఘుమఘుమలాడే మసాలాల కలయికతో తయారయ్యే ఈ లస్సీ కేవలం మీ దాహాన్ని తీర్చడమే కాకుండా మీ నరనరాలకు చల్లదనాన్ని అందించి, శరీరానికి, మనసుకి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది.

మసాలా లస్సీ తయారీకి కావలసిన పదార్థాలు
చిక్కటి, చల్లని పెరుగు - 1 కప్పు
వేయించిన జీలకర్ర పొడి - 1 స్పూన్
చాట్ మసాలా - అర స్పూన్
నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర, పుదీనా ఆకులు - గుప్పెడు
చల్లని నీరు - అవసరాన్ని బట్టి
ఐస్ క్యూబ్స్ - కొన్ని
మసాలా లస్సీ తయారీ విధానం
-మసాలా లస్సీ తయారీ కోసం ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్ లేదా బ్లెండర్ తీసుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో చిక్కటి పెరుగు, సువాసన వెదజల్లే జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పుదీనా ఆకులను వేయండి. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి, హ్యాండ్ బ్లెండర్ తో సుమారు 5-6 నిమిషాల పాటు, నురుగు వచ్చి, మిశ్రమం అంతా మీగడలా నునుపుగా మారే వరకు బాగా చిలకండి.
-పెరుగులోని ప్రతి అణువు మసాలాలతో మమేకమై అద్భుతమైన రుచిని అందిస్తుంది.
-ఈ క్రీమీ మిశ్రమాన్ని ఒక అందమైన గాజు జార్‌లోకి మార్చండి.
-మీకు కావలసినంత చిక్కదనం కోసం మరికొన్ని నీళ్ళు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపండి.
-చివరగా పైన మరికొన్ని తాజా కొత్తిమీర ఆకులతో అలంకరిస్తే కంటికి ఇంపుగా, రుచికి అమోఘంగా ఉండే మన మసాలా లస్సీ రెడీ.
-చల్లచల్లని, ఘాటైన మసాలా లస్సీని ఒక సిప్ తాగితే మీ రుచి గ్రంథులు ఆనందంతో నాట్యం చేస్తాయి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications