Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
చలికాలం సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద సంజీవని..ఇంట్లోనే స్వచ్ఛమైన చ్యవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే..
చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. దీనికి మన పెద్దలు సూచించిన ఆయుర్వేద సంజీవని చ్యవన్ ప్రాష్. ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా చ్యవన్ ప్రాష్ తినడం లేదా గోరువెచ్చని పాలతో తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.
అయితే ప్రస్తుత మార్కెట్ లో దొరికే చ్యవన్ ప్రాష్ లో కల్తీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కల్తీ లేని, స్వచ్ఛమైన చ్యవన్ ప్రాష్ ను మీ వంటింట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తాజా ఉసిరికాయలు - 1 కిలో
దేశీ ఆవు నెయ్యి - అర కప్పు
నువ్వుల నూనె - అర కప్పు
బెల్లం- 800 గ్రాములు
తేనె - ఒకటిన్నర కప్పులు
నీళ్లు - ఉసిరి ఉడికించడానికి సరిపడా
అశ్వగంధ - 25 గ్రాములు
విదారికండ్ - 25 గ్రాములు
పిప్పలి - 10 గ్రాములు
దాల్చిన చెక్క - 10 గ్రాములు
యాలకులు - 10 గ్రాములు
నాగకేసర్ - 5 గ్రాములు
లవంగాలు - 5 గ్రాములు
బిర్యానీ ఆకులు- 2-3
శొంఠి- 10 గ్రాములు
ములేతి- 10 గ్రాములు
తులసి పొడి - 10 గ్రాములు
కుంకుమపువ్వు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి.
-ఒక ప్రెజర్ కుక్కర్ లో ఉసిరికాయలు, తగినన్ని నీళ్లు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత, ఉసిరికాయల నుండి గింజలను వేరు చేసి మెత్తటి గుజ్జు తీసుకోవాలి. ఈ గుజ్జును మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా పేస్ట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో నువ్వుల నూనె, నెయ్యి వేసి వేడి చేశాక తయారు చేసి పెట్టుకున్న ఉసిరి పేస్ట్ ను అందులో వేయాలి. మంటను తక్కువలో ఉంచి, సుమారు 15-20 నిమిషాల పాటు వేయించాలి.
-ఉసిరిలోని తేమ పోయి, మిశ్రమం దగ్గర పడి, నెయ్యి పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి.
-స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి అందులో బెల్లం తురుము వేసి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించండి. తీగ పాకం రానవసరం లేదు, బెల్లం కరిగి లేత పాకం వస్తే చాలు. ఇప్పుడు ఈ బెల్లం సిరప్‌ను వడకట్టి, వేయించిన ఉసిరి మిశ్రమంలో కలపాలి. రెండూ బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి.

-సుగంధ ద్రవ్యాలన్నింటినీ (అశ్వగంధ, శొంఠి, యాలకులు మొదలైనవి) మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఉడుకుతున్న ఉసిరి-బెల్లం మిశ్రమంలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. సన్నని మంటపై మరో 10-15 నిమిషాలు ఉడికించాలి.
-మిశ్రమం జామ్ లా చిక్కబడిన తర్వాత, కుంకుమపువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
-స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయుర్వేదం ప్రకారం వేడి పదార్థాలలో తేనె కలపకూడదు. కాబట్టి చ్యవన్ ప్రాష్ గోరువెచ్చగా లేదా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తేనెను కలిపి బాగా తిప్పాలి.
-తయారైన చ్యవన్ ప్రాష్‌ను శుభ్రమైన, తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు, గది ఉష్ణోగ్రత వద్దే నెలల తరబడి నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications