Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శక్తినిచ్చే స్నాక్..బెల్లం తీపితో నోరూరించే సజ్జ బూరెలు..ఎలా చేసుకోవాలంటే
ఆరోగ్యానికి మేలు చేసేవాటిల్లో సజ్జలు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాయి. అలాంటి సజ్జలతో బూరెలు చేస్తే..ఎన్ని తిన్నా అలా పోతూనే ఉంటాయి. చిరుధాన్యాలలో ముఖ్యమైన సజ్జలను ఉపయోగించి బెల్లం తీపితో చేసే ఈ బూరెలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంంచిది. ఇవి శక్తినిచ్చే స్నాక్ గా చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు,శుభకార్యాల సమయంలో తరచుగా తయారుచేసే సంప్రదాయ తీపి వంటకం ఇది. సజ్జ బూరెలను తయారు చేయడానికి పిండిని తయారుచేసే విధానంలో కొంచెం శ్రద్ధ అవసరం. టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సజ్జ బూరెలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సజ్జ బూరెలు తయారీకీ కావాల్సిన పదార్థాలు
-ఎండుకొబ్బరి
-యాలకలు
-సజ్జలు
-బెల్లం
-ఆయిల్

సజ్జ బూరెలు తయారీ విధానం
-ముందుగా 1 కేజీ పచ్చ సజ్జలను శుభ్రంగా కడిగాక మళ్లీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-రాత్రంతా నానిన సజ్జలల్లో నుంచి నీళ్లను వంపేసి సజ్జలను ఏదైనా పొడి గుడ్డపై పరిచి ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి.
-పూర్తిగా ఆరిన సజ్జలను మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు,కొంచెం లైట్ గా బరకగా ఉంటేలా చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని వెడల్పాటి ప్లేట్ లేదా బేసన్ లో వేసుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 50 గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు, 15 యాలకలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండుకొబ్బరి పొడిని ముందుగా రెడీ చేసుకున్న జొన్న పిండిలో వేసి కలిసేలా కలపాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకేజీ బెల్లం తురుము వేసి బెల్లం మునిగేంతవరకు నీళ్లు పోసి మీడియం మంట మీద బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు సజ్జ పిండిలో అర టీస్పూన్ ఉప్పు వేసి కలిపాక, రెడీ చేసుకున్న బెల్లం నీళ్లను వడకట్టి పోసుకుండి. గరిటతో మొత్తం కలిసేలా కలుపుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యి పెట్టి మెత్తగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా పిండిని కలుపుకోవాలి. బెల్లం నీళ్లు సరిపోలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్లను కొంచెం కొంచెంగా చల్లుకుంటూ కలుపుకోవచ్చు. చన్నీళ్లు పోస్తే బూరెలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.
-తర్వాత ఓ గుడ్డను తడిపి దాని మీద పిండిని కొంచెం పెట్టి బూరెల్లా వత్తుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు,మరీ మందంగా కూడా వద్దు. కొంచెం మీడియంగా ఉండేట్లు వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేశాక అందులో వత్తుకున్న సజ్జ బూరెలను ఒక్కొక్కటిగా వేశాక అవి పొంగి పైకి వచ్చాక రెండో వైపుకు తిప్పి రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఆయిల్ లో నుంచి బయటకు తీసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications