Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చలికాలం స్పెషల్..నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్ పటాటో హల్వా
చలికాలం మొదలైందంటే చాలు.. సాయంత్రం వేళ వేడి వేడిగా ఏదైనా తీపి పదార్థం తినాలని మనసు కోరుకోవడం సహజం. ఈ సీజన్ లో మనకు స్వీట్ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి క్యారెట్ హల్వా లేదా గులాబ్ జామున్. ఇవి రుచిగా ఉంటాయన్న మాట వాస్తవమే కానీ ప్రతిసారీ ఇవే తింటే బోర్ కొట్టేస్తుంది కదా. ఈసారి కొంచెం వెరైటీగా చిలగడదుంప హల్వా(స్వీట్ పొటాటో హల్వా) ట్రై చేయండి.
శీతాకాలంలో మార్కెట్లో విరివిగా లభించే కూరగాయల్లో చిలగడదుంప కేవలం రుచి కోసమే కాదు, శీతాకాలంలో శరీరానికి అవసరమైన ఉష్ణాన్ని, శక్తిని ఇవ్వడంలో ఇది దిట్ట. ఇందులో ఉండే విటమిన్ A, ఫైబర్, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లలకు ఇది బలవర్థకమైన ఆహారం. చక్కెర బదులు బెల్లం వాడటం వల్ల ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

కావలసిన పదార్థాలు
చిలగడదుంపలు: 2 లేదా 3
బెల్లం తురుము: రుచికి సరిపడా
స్వచ్ఛమైన నెయ్యి: అర కప్పు
పాలు: అర కప్పు
యాలకుల పొడి: 1 టీస్పూన్
జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
బాదం: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడగాలి. వాటిని కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
-ఉడికించిన దుంపలు చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసివేసి, దుంపలను బాగా మెదిపి ముద్దలా పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులను వేసి, దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
-వేయించిన డ్రై ఫ్రూట్స్ నుండి మంచి వాసన వస్తున్నప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలిన నెయ్యిని వేసి వేడి చేయండి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న చిలగడదుంప ముద్దను వేయాలి. సన్నని మంటపై దుంప మిశ్రమాన్ని నెయ్యిలో బాగా వేయించాలి.
-పచ్చి వాసన పోయి నెయ్యి వాసన పట్టేలా 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులో అర కప్పు పాలు పోసి, మిశ్రమం దగ్గర పడేవరకూ ఉడికించాలి. పాలు వేయడం వల్ల హల్వాకు కమ్మని రుచి వస్తుంది.
-మిశ్రమం చిక్కబడి నెయ్యి పైకి తేలుతున్నప్పుడు అందులో తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి హల్వా మంచి రంగులోకి మారుతుంది. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం ముక్కలను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి చిలగడదుంప హల్వా రెడీ. దీనిని వేడిగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులకు లేదా అతిథులకు వడ్డించండి. ఆ నెయ్యి వాసన, బెల్లం తీపి, డ్రై ఫ్రూట్స్ కరకరలాడుతుంటే..ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications