Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే కాంబినేషన్..ఘుమఘుమలాడే ఆంధ్రా స్టైల్ చిన్న ఉల్లిపాయ పల్లీ చట్నీ
ఇడ్లీ, దోశల్లోకి సాధారణంగా మనం కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో సరిపెట్టుకుంటాం. కానీ ఈసారి ఆంధ్రా స్టైల్ చిన్న ఉల్లిపాయ - వేరుశనగ పచ్చడి ట్రై చేయండి. ఈ చట్నీ ఒక్కసారి రుచి చూస్తే, మీరు రెగ్యులర్ గా తినే ఇడ్లీల కంటే మరో రెండు ఇడ్లీలు ఎక్కువే లాగిస్తారు.
దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు. ఘుమఘుమలాడే న్న ఉల్లిపాయ - వేరుశనగ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు- సుమారు 20
వేరుశనగ గుళ్ళు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
శనగ పప్పు -అర టేబుల్ స్పూన్
మినపప్పు - అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2
ఎండు మిరపకాయలు - 4
కరివేపాకు - 1 రెమ్మ
జీలకర్ర - అర టీస్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం:
నూనె - అర టేబుల్ స్పూన్
ఆవాలు -పావు టీస్పూన్
మినపప్పు - పావు టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
కరివేపాకు - కొద్దిగా
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక శనగ పప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు (పల్లీలు), ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. పప్పులు మాడిపోకుండా, బంగారు రంగు వచ్చేవరకు కలుపుతూ వేయించుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసి శుభ్రం చేసుకున్న చిన్న ఉల్లిపాయలను వేయాలి. చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే సాధారణ ఉల్లిపాయ ముక్కలైనా వాడవచ్చు, కానీ చిన్న ఉల్లిపాయలతో రుచి అద్భుతంగా ఉంటుంది.
-ఉల్లిపాయలు కాస్త మగ్గినప్పుడు అందులో జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు మెత్తబడి, లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించి చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న చింతపండును (నీటితో సహా లేదా గుజ్జు తీసి) జత చేయండి. అవసరమైనన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. మరీ జారుగా కాకుండా, ఇడ్లీలోకి అద్దుకునేలా గట్టిగా ఉంటే బాగుంటుంది.
-ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయిలో అర చెంచా నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ వేసి వేయించాలి. అవి చిటపటలాడాక కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. ఈ వేడి వేడి తాలింపును చట్నీలో పోసి బాగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే ఆంధ్రా స్టైల్ చిన్న ఉల్లిపాయ వేరుశనగ చట్నీ రెడీ. దోశ, ఊతప్పం, పెసరట్టులోకి కూడా ఇది సూపర్ కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications