Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ప్రస్తుతం మనకు మార్కెట్లో, రోడ్ల పక్కన ఎక్కడ చూసినా పచ్చటి జామకాయలు కనిపిస్తున్నాయి. జామకాయను చూడగానే కోసుకుని, కాస్త ఉప్పు, కారం చల్లుకుని తినడమే మనకు అలవాటు.
కానీ జామకాయతో ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే రుచికరమైన చట్నీని కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?పుల్లపుల్లగా, కారంకారంగా, అద్భుతమైన రుచితో ఉండే ఈ విభిన్నమైన చట్నీని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ లొట్టలేసుకుని తింటారు.

జామకాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
దోర జామకాయలు - 3
సాంబార్ ఉల్లిపాయలు- అర కప్పు
నూనె - 2 టీస్పూన్లు
జీలకర్ర - పావు టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 5
చింతపండు - ఒక చిన్న అంగుళం ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండు మిర్చి - 1
కరివేపాకు - 1 రెమ్మ
జామకాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా సగం పండిన (దోరగా ఉన్న) జామకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసేసి ముక్కలను పక్కన పెట్టుకోండి.
-ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో జామకాయ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడి నీటిలోనే ముక్కలను మరో రెండు నిమిషాలు ఉంచి, ఆ తర్వాత నీరంతా వంపేసి జామకాయ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి మీడియం మంట మీద దోరగా వేయించిన తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసి మరో నిమిషం వేయించి, ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి చల్లార్చాలి.
-అదే పాన్ లో అవసరమైతే ఇంకో చుక్క నూనె వేసి తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి, మెత్తగా అయ్యి లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన పప్పులు, ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి నీళ్లు పోయకుండా మెత్తగా పౌడర్ లా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న జామకాయ ముక్కలను కూడా అదే మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. అవసరమైతేనే అతి తక్కువగా నీటిని కలుపుకోండి. రుబ్బిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-చివరగా ఒక చిన్న పాన్ లో ఒక చెంచా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి. వేడి వేడి తాలింపును నేరుగా జామకాయ చట్నీపై పోసి బాగా కలపాలి. అంతే జామకాయ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications