Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బోర్ కొట్టే లెమన్ రైస్ కు మసాలా టచ్.. తింటే వదిలిపెట్టరు!
సమయం తక్కువగా ఉన్నప్పుడు చాలామందికి వెంటనే గుర్తొచ్చే వంటకం నిమ్మకాయ పులిహోర. (లెమన్ రైస్). ఇది తయారు చేయడం సులభం,రుచిగా కూడా ఉంటుంది. కానీ ప్రతిసారీ అదే లెమన్ రైస్ పెడితే పిల్లలు కచ్చితంగా బోర్ ఫీల్ అవుతారు. పెద్దలకంటే పిల్లలు ఒకేరకమైన ఆహారానికి చాలా త్వరగా విసుగు చెందుతారు. సగం బాక్స్ అలాగే ఇంటికి తెచ్చేస్తుంటారు.
మరి మీ పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకురావాలా? అయితే రెగ్యులర్ లెమన్ రైస్ కు కొద్దిగా మసాలా జోడించి మసాలా లెమన్ రైస్ తయారు చేసి చూడండి. వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, కొబ్బరి వంటి దినుసులతో చేసే ఈ స్పెషల్ రైస్ రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. నిమ్మకాయ రైస్ ఇష్టపడని వారు సైతం ఈ కొత్త తరహా వంటకాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. నోరూరించే మసాలా లెమన్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
ఉడికించిన అన్నం (లేదా మిగిలిపోయిన అన్నం) - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - అర అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4
పసుపు - ఒక చిటికెడు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఎండు మిరపకాయలు - 2
వేరుశనగ గుళ్లు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి శనగపప్పు - అర టేబుల్ స్పూన్
మినపప్పు - అర టేబుల్ స్పూన్
నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కడిగి 15 నిమిషాలు నానబెట్టండి. కుక్కర్ లో తగినన్ని నీళ్లు పోసి, అందులో ఒక టీస్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించుకోండి. ఉడికిన అన్నాన్ని పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి వేయాలి. నీళ్లు అస్సలు పోయకుండా బరకగా రుబ్బుకోవాలి. ఇదే ఈ వంటకానికి అసలైన రుచినిచ్చే మసాలా.
-స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి. ఆవాలు వేసి చిటపటలాడాక పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించండి. అవి రంగు మారాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
-తాలింపు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేయండి. మంటను మీడియంలో పెట్టి మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు అందులో ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నం, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే మసాలా లెమన్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications