Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మిగిలిన అన్నంతో క్రీమీ రబ్డీ..తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
సాధారణంగా మన ఇంట్లో అన్నం మిగిలిపోతే ఏం చేస్తాం? పులిహోర, ఫ్రైడ్ రైస్, లేదా దద్దోజనం చేసుకుని తింటాం. కానీ ఎప్పుడూ అవే రొటీన్ వంటకాలు తిని బోర్ కొట్టిందా? మిగిలిన అన్నంతో ఓ అద్భుతమైన స్వీట్ తయారు చేయవచ్చని మీకు తెలుసా? మిగిలిపోయిన అన్నం, కాసిన్ని మఖానా (తామర గింజలు) ఉంటే చాలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కమ్మని, క్రీమీ రబ్డీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదైనా తీపి తినాలనిపించినా లేదా ఇంట్లో ఏదైనా చిన్న వేడుక జరిగినా ఈ స్వీట్ బెస్ట్ ఆప్షన్. మఖానాలోని కరకరలాడే గుణం, అన్నం వల్ల వచ్చే క్రీమీ ఆకృతి ఈ స్వీట్ కి రాయల్ టచ్ ఇస్తాయి. పైగా మఖానా ఆరోగ్యానికి చాలా మంచిది.

మఖానా రైస్ రబ్డీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం - అర కప్పు
మఖానా (తామర గింజలు) - ఒక కప్పు
చిక్కటి పాలు - ఒక లీటరు
పంచదార -5 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
బాదం, పిస్తా పప్పులు - 10
నెయ్యి - ఒక టీస్పూన్
కుంకుమపువ్వు రేకులు - కొద్దిగా
మఖానా రైస్ రబ్డీ తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక ఒక కప్పు మఖానా గింజలను అందులో వేసి, తక్కువ మంట మీద అవి కరకరలాడేంత వరకు దోరగా వేయించండి.
ఇప్పుడు వేయించిన మఖానాలలో సగం తీసుకుని మిక్సీలో బరకగా పొడి చేసుకోండి. మిగిలిన సగం మఖానాలను అలాగే ఉంచండి.
ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న మరొక గిన్నెను ఉంచి, అందులో లీటరు చిక్కటి పాలు పోయండి. పాలను మీడియం మంట మీద బాగా మరిగించండి. పాలు అడుగున మాడిపోకుండా, గరిటెతో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
పాలు కొద్దిగా మరిగిన తర్వాత మిగిలిన అన్నాన్ని చేతితో మెత్తగా నలిపి లేదా మిక్సీలో ఒకసారి తిప్పి ఆ పాలలో కలపండి. ఈ అన్నం కలపడం వల్లే మన రబ్డీకి బయట స్వీట్ షాపుల్లో దొరికేలాంటి క్రీములాంటి చిక్కదనం వస్తుంది.
పాలు, అన్నం మిశ్రమం కలిసి పాలు చిక్కబడటం మొదలైనప్పుడు, అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న మఖానా పొడిని, అలాగే పక్కన పెట్టుకున్న సగం మఖానా గింజలను వేసి బాగా కలపండి.
మిశ్రమం మరింత చిక్కబడ్డాక, అందులో పంచదార, యాలకుల పొడి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను వేయండి. అన్ని పదార్థాలు కలిసేలా మరో 5-7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించండి.
రబ్డీ తయారయ్యాక, పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా పప్పులను చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన మఖానా రైస్ రబ్డీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications