అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే

Posted By:

ఎప్పుడూ ఒకేలాంటి బిర్యానీ, మామూలు పులావ్‌ లు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే కమ్మని కొబ్బరి పాలు, లేత మటన్ ముక్కల కలయికతో చేసే కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ఓ సారి తిని తీరాల్సిందే. ఇంట్లో వాళ్ళందరికీ ఒక మంచి విందు భోజనం అందించాలన్నా, ఇంటికి వచ్చిన అతిథులను మీ వంటతో ఆశ్చర్యపరచాలన్నా ఈ రెసిపీని కచ్చితంగా ట్రై చేయాల్సిందే. సువాసనలు వెదజల్లే ఈ పులావ్‌ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Bored of Regular Biryani Try This Rich Creamy Coconut Milk Mutton Pulao Recipe in Telugu

కోకోనట్ మిల్క్ మటన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు

మటన్ మ్యారినేషన్ కోసం

మటన్ - 1 కిలో (శుభ్రంగా కడిగినది)
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - కొద్దిగా
కారం - తగినంత
గరం మసాలా - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు
పెరుగు - అర కప్పు

మటన్ ఉడికించడానికి

ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 6
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
యాలకులు - 3
లవంగాలు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం
అనాస పువ్వు- 2
మరాఠీ మొగ్గ - 1
జాజికాయ, జాపత్రి - కొద్దిగా

కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!

పులావ్ తయారీకి

బాస్మతి బియ్యం - 700 గ్రాములు
నెయ్యి, నూనె - తగినంత
జీడిపప్పు - 10
మరాఠీ మొగ్గ - 2
అనాస పువ్వు - 1
బిర్యానీ ఆకు - 2
దాల్చిన చెక్క - 1
సోంపు - 1 టీస్పూన్
జాజికాయ, జాపత్రి - కొద్దిగా
లవంగాలు - 4
యాలకులు - 3
పుదీనా, కొత్తిమీర - గుప్పెడు
మటన్ ఉడికించిన నీరు (స్టాక్), చిక్కటి కొబ్బరి పాలు

కోకోనట్ మిల్క్ మటన్ పులావ్ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో శుభ్రం చేసిన మటన్ తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. దీన్ని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

-ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి, నూనె వేడి చేయాలి. అందులో మటన్ ఉడికించడానికి చెప్పిన మసాలా దినుసులన్నీ (బిర్యానీ ఆకు, యాలకులు మొదలైనవి) వేసి వేయించాలి. సువాసన వస్తుండగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

-ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన మటన్ వేసి, తగినన్ని నీళ్లు పోసి 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక ఉడికిన మటన్ ముక్కలను, మిగిలిన నీటిని (మటన్ స్టాక్) విడిగా పెట్టుకోవాలి.

-ఒక పెద్ద వెడల్పాటి గిన్నె లేదా హండీలో కొద్దిగా నెయ్యి, నూనె వేడి చేయాలి. జీడిపప్పుతో పాటు పులావ్ కోసం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసి దోరగా వేయించాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

-ఈ పులావ్ పర్ఫెక్ట్‌ గా రావాలంటే నీటి కొలత చాలా ముఖ్యం. మీరు తీసుకున్న ప్రతి 1 కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల ద్రవం పోయాలి. 5 కప్పుల బియ్యం తీసుకుంటే మొత్తం ఏడున్నర కప్పుల ద్రవం (మటన్ స్టాక్ + కొబ్బరి పాలు కలిపి) పోయాలి. అయితే పులావ్‌ కి అద్భుతమైన రుచి రావాలంటే కొబ్బరి పాల కంటే మటన్ స్టాక్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

-కొలిచి పెట్టుకున్న మటన్ స్టాక్, కొబ్బరి పాలను మసాలా గిన్నెలో పోసి మరిగించాలి. ద్రవం మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. ముందుగా పెద్ద మంట మీద 5 నిమిషాలు ఉడికించి, ఆ తర్వాత మంటను బాగా తగ్గించి మూతపెట్టి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి.

-అంతే మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడే అద్భుతమైన కోకనట్ మిల్క్ మటన్ పులావ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 21, 2026, 6:33 [IST]
Desktop Bottom Promotion