Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే
ఎప్పుడూ ఒకేలాంటి బిర్యానీ, మామూలు పులావ్ లు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే కమ్మని కొబ్బరి పాలు, లేత మటన్ ముక్కల కలయికతో చేసే కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ఓ సారి తిని తీరాల్సిందే. ఇంట్లో వాళ్ళందరికీ ఒక మంచి విందు భోజనం అందించాలన్నా, ఇంటికి వచ్చిన అతిథులను మీ వంటతో ఆశ్చర్యపరచాలన్నా ఈ రెసిపీని కచ్చితంగా ట్రై చేయాల్సిందే. సువాసనలు వెదజల్లే ఈ పులావ్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కోకోనట్ మిల్క్ మటన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మటన్ మ్యారినేషన్ కోసం
మటన్ - 1 కిలో (శుభ్రంగా కడిగినది)
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - కొద్దిగా
కారం - తగినంత
గరం మసాలా - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు
పెరుగు - అర కప్పు
మటన్ ఉడికించడానికి
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 6
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
యాలకులు - 3
లవంగాలు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం
అనాస పువ్వు- 2
మరాఠీ మొగ్గ - 1
జాజికాయ, జాపత్రి - కొద్దిగా
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
పులావ్ తయారీకి
బాస్మతి బియ్యం - 700 గ్రాములు
నెయ్యి, నూనె - తగినంత
జీడిపప్పు - 10
మరాఠీ మొగ్గ - 2
అనాస పువ్వు - 1
బిర్యానీ ఆకు - 2
దాల్చిన చెక్క - 1
సోంపు - 1 టీస్పూన్
జాజికాయ, జాపత్రి - కొద్దిగా
లవంగాలు - 4
యాలకులు - 3
పుదీనా, కొత్తిమీర - గుప్పెడు
మటన్ ఉడికించిన నీరు (స్టాక్), చిక్కటి కొబ్బరి పాలు
కోకోనట్ మిల్క్ మటన్ పులావ్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో శుభ్రం చేసిన మటన్ తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. దీన్ని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
-ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి, నూనె వేడి చేయాలి. అందులో మటన్ ఉడికించడానికి చెప్పిన మసాలా దినుసులన్నీ (బిర్యానీ ఆకు, యాలకులు మొదలైనవి) వేసి వేయించాలి. సువాసన వస్తుండగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
-ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన మటన్ వేసి, తగినన్ని నీళ్లు పోసి 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక ఉడికిన మటన్ ముక్కలను, మిగిలిన నీటిని (మటన్ స్టాక్) విడిగా పెట్టుకోవాలి.
-ఒక పెద్ద వెడల్పాటి గిన్నె లేదా హండీలో కొద్దిగా నెయ్యి, నూనె వేడి చేయాలి. జీడిపప్పుతో పాటు పులావ్ కోసం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసి దోరగా వేయించాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
-ఈ పులావ్ పర్ఫెక్ట్ గా రావాలంటే నీటి కొలత చాలా ముఖ్యం. మీరు తీసుకున్న ప్రతి 1 కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల ద్రవం పోయాలి. 5 కప్పుల బియ్యం తీసుకుంటే మొత్తం ఏడున్నర కప్పుల ద్రవం (మటన్ స్టాక్ + కొబ్బరి పాలు కలిపి) పోయాలి. అయితే పులావ్ కి అద్భుతమైన రుచి రావాలంటే కొబ్బరి పాల కంటే మటన్ స్టాక్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
-కొలిచి పెట్టుకున్న మటన్ స్టాక్, కొబ్బరి పాలను మసాలా గిన్నెలో పోసి మరిగించాలి. ద్రవం మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. ముందుగా పెద్ద మంట మీద 5 నిమిషాలు ఉడికించి, ఆ తర్వాత మంటను బాగా తగ్గించి మూతపెట్టి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి.
-అంతే మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడే అద్భుతమైన కోకనట్ మిల్క్ మటన్ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications