Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్
చికెన్ తో రొటీన్ గా చేసుకునే చికెన్ కర్రీ, చికెన్ వేపుడు లేదా చికెన్ 65 లాంటివి చేసి బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, సరికొత్త రుచితో కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ ట్రై చేయండి. దీని తయారీ విధానం చాలా సులభం, కానీ దీని రుచి మాత్రం మీరు ఫైవ్ స్టార్ హోటల్ లో తిన్న ఫీలింగ్ ను ఇస్తుంది. వేడి వేడి అన్నం, బిర్యానీ, చపాతీ, రోటీలతో పాటు ఉదయం పూట తినే ఇడ్లీ, దోసెల్లోకి కూడా ఈ చికెన్ రోస్ట్ అద్భుతంగా సెట్ అవుతుంది.

కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు
లేత చికెన్ - 1 కిలో
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - 2 అంగుళాల ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8
ఉల్లిపాయలు - 2 పెద్దవి
టమాటో - 1 పెద్దది
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మకాయ - 1
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
తాజా కొత్తిమీర - 1 కప్పు
పుదీనా ఆకులు - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
జీడిపప్పులు - 5
దాల్చినచెక్క - 2 ముక్కలు
యాలకులు - 4
లవంగాలు - 6
కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారీ విధానం
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మరియు జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తని ఆకుపచ్చని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
దాల్చినచెక్క, యాలకులు, లవంగాలను రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి మెత్తటి పొడిలా దంచి సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లిని ఫ్రెష్ గా దంచి వేయాలి. దీనిలోని పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి.
ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కొత్తిమీర పేస్ట్ ను ఇందులో వేయాలి. మంటను మీడియంలో పెట్టి, మసాలాలోని నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి.
మసాలా పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాత, ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, దంచి పెట్టుకున్న గరం మసాలా పొడి వేసి ముక్కలన్నింటికీ మసాలా పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చికెన్‌ను ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి.
చికెన్ దాదాపుగా పూర్తిగా ఉడికిన తర్వాత, తరిగిన టమాటా ముక్కలు వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. టమాటాలు మెత్తబడి, కూర రోస్ట్‌లా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా నిమ్మరసం పిండి, ఒకసారి బాగా కలుపుకోవాలి.
అంతే నోరూరించే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications