Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
నాన్ వెజ్ లవర్స్ ని ఫిదా చేసే నేపాల్ ఫేమస్ చికెన్ చుకౌని..చపాతీ,రోటీతో తింటే స్వర్గమే!
నేపాల్ దేశపు వంటకాలు వాటి రుచికి, ఆరోగ్యకరమైన తయారీ విధానాలకు ప్రసిద్ధి చెందాయి. అందులోనూ నేపాల్ లోని పాల్పా జిల్లా నుండి వచ్చిన చుకౌని అనే వంటకం చాలా ఫేమస్. సాంప్రదాయకంగా దీనిని బంగాళాదుంపలతో చేస్తారు. కానీ మాంసాహార ప్రియులు దీనిని చికెన్ తో కూడా తయారు చేసుకుంటారు. దీనినే చికెన్ చుకౌని అంటారు.
ఇది ఒక రకమైన స్పైసీ చికెన్ సలాడ్ లేదా పెరుగు పచ్చడి లాంటిది. ఇది పుల్లగా, కారంగా, చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని చపాతీ లేదా రోటీలతో తింటుంటే స్వర్గం కనబడతది. నేపాలీ ఫేమస్ చికెన్ చుకౌని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
చికెన్ కోసం
బోన్ లెస్ చికెన్-400 గ్రాములు
అల్లంవెల్లుల్లి పేస్ట్-2 టీస్పూన్లు
ఉప్పు-అర టీస్పూన్
మిరియాలు-అర టీస్పూన్
కశ్మీరీ కారం పొడి-1 టీస్పూన్
పసుపు-అర టీస్పూన్
నిమ్మరసం-1 టీస్పూన్
ఆయిల్- ఫ్రై చేయడానికి కొంచెం
మిక్స్ కోసం
ఉల్లిపాయ-1 చిన్నది
పచ్చిమిర్చి-1-2
కొత్తిమీర-3 టేబుల్ స్పూన్లు
గట్టి పెరుగు-1 కప్పు
వెల్లుల్లి పేస్ట్-1 టీస్పూన్
ఉప్పు- అర టీస్పూన్
చక్కెర- అర టీస్పూన్
తడ్కా కోసం
ఆవాల నూనె-ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు- అర టీస్పూన్
కశ్మీరీ కారం పొడి- 1 టీస్పూన్
కసూరి మేథీ-1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసిన చికెన్ ముక్కలు వేయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాలు, కాశ్మీరీ కారం, పసుపు, నిమ్మరసం కలిపి 10-15 నిమిషాలు పక్కన పెట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో చాలా తక్కువ నూనె వేసి చికెన్ ముక్కలను వేసి మీడియం-హై మంట మీద చికెన్ ముక్కలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-వేయించిన చికెన్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో సన్నగా పొడవుగా తరరిగిన ఉల్లిపాయ, పొడవుగా చీరిన పచ్చి మిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం బాగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చక్కెర వేసి బాగా మెత్తగా క్రీమీగా అయ్యేవరకు కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆవాల నూనె పోసి పొగలు వచ్చేదా వేడి చెయ్యాలి. ఇప్పుడు మంటను తగ్గించి పసుపు, కశ్మీరీ కారం పొడి, నలిపిన కసూరి మేథీ వేయించాలి.
-వేయించిన తడ్కాని కలుపుకున్న పెరుగు మిశ్రమంలో వేసి మెత్తం కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని చికెన్ ముక్కల మిశ్రమం ఉన్న గిన్నెలో వేసి నెమ్మదిగా కలపాలి. చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అంతే చికెన్ చుకౌని రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications