Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
ప్రతిసారి ఒకే రకమైన చికెన్ కూర తిని మీకు బోర్ కొట్టిందా? మీ నాలికకు కొత్త రుచిని పరిచయం చేస్తూ, ఏదైనా క్రీమీగా, భిన్నంగా ట్రై చేయాలని ఉందా? అయితే కొబ్బరి(కోకోనట్)చికెన్ కర్రీ ట్రై చేయండి. మృదువైన ఆకృతి, కొద్దిపాటి పులుపు,సుగంధ ద్రవ్యాల ఘాటు కలగలిసిన ఈ కూర రుచి వర్ణనాతీతం.

దక్షిణ భారత వంటకాల్లో కొబ్బరి, కరివేపాకు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. వేడి నూనెలో ఆవాలు చిటపటలాడుతుంటే, కరివేపాకు సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంటే, దానికి కొబ్బరి పాల కమ్మదనం తోడైతే.. ఇంట్లో చేసిన సాధారణ చికెన్ కర్రీ కూడా ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచిని తలపిస్తుంది. వంట రాని వారు కూడా అద్భుతంగా కోకోనట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కోకోనట్ చికెన్ కర్రీ కావలసిన పదార్థాలు
-అర కిలో చికెన్
-2 కప్పుల చిక్కటి కొబ్బరి పాలు
-1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు
-2 ఉల్లిపాయలు
-1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
-2 పచ్చిమిర్చి,
-10 కరివేపాకులు
-అర టీస్పూన్ ఆవాలు
-దాల్చినచెక్క
-లవంగాలు
-యాలకులు
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-ఉప్పు
-2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె
కోకోనట్ చికెన్ కర్రీ తయారీ విధానం
-ముందుగా కడిగిన చికెన్ లో పసుపు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించండి. మూతపెట్టి అరగంట పాటు పక్కన పెడితే మసాలాలు లోపలికి ఇంకి, చికెన్ మృదువుగా, జ్యూసీగా మారుతుంది.
-ఒక మందపాటి గిన్నెలో కొబ్బరి నూనె వేడి చేయండి. ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు, నిండు మసాలా దినుసులు వేయండి.మసాలాలు మాడకుండా చూసుకోండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తక్కువ మంటపై దోరగా వేయించండి. అవి లేత బంగారు రంగులోకి మారాక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి పచ్చివాసన పోయేలా తేలికగా వేయించండి.
-ఇప్పుడు పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి పెద్ద మంటపై 5-7 నిమిషాలు వేయించండి. ఇలా చేయడం వల్ల చికెన్ రంగు మారి, మసాలాలు ముక్కలకు బాగా పడతాయి.
-మంటను సిమ్ లో పెట్టి, కొబ్బరి పాలు, చింతపండు గుజ్జు వేసి నెమ్మదిగా కలపండి. గ్రేవీ విరిగిపోకుండా ఉండాలంటే మంట తక్కువగా ఉండాలి. మూతపెట్టి ఓ 15-20 నిమిషాల పాటు ఉడికించండి. మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే గ్రేవీ వెల్వెట్ లాగా మారుతుంది.
-చికెన్ మెత్తగా ఉడికి, గ్రేవీ క్రీమీగా చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయండి. అంతే గుమగుమలాడే కొబ్బరి కోకోనట్ కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నం లేదా కేరళ స్టైల్ అప్పంతో కలిపి తింటుంటే ప్రతి ముద్దకు ప్రాణం లేచి వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications