Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!
ఇడ్లీ లేదా దోసెలు ఎంత రుచిగా ఉన్నా.. వాటికి సరైన చట్నీ తోడైతేనే అసలైన మజా వస్తుంది. సాధారణంగా ఇడ్లీ, దోసెలకు అందరికీ ముందుగా గుర్తొచ్చేది, ఇష్టపడేది కొబ్బరి చట్నీ. కానీ ఎప్పుడూ ఒకే రకమైన చట్నీ తింటే బోర్ కొడుతుంది కదూ. కొబ్బరి చట్నీకి కాస్త టమాటా చట్నీని జత చేసి తింటే ఆ రుచే వేరు.

మీరు రెగ్యులర్ గా చేసే టమాటా చట్నీకి ఓ చిన్న మ్యాజిక్ జోడిస్తే.. హోటల్ స్టైల్ రుచి మీ ఇంట్లోనే వస్తుంది. ఆ మ్యాజికల్ ఇంగ్రిడియంట్..వేరుశెనగలు. టమాటాలకు పల్లీలు తోడైతే ఆ చట్నీకి వచ్చే కమ్మదనం మాటల్లో చెప్పలేం. టమాటో పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
టమాటో పల్లీ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
టమాటాలు - 2
పెద్ద ఉల్లిపాయ - 1
వేరుశెనగలు (పల్లీలు) - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5
అల్లం - ఒక చిన్న ముక్క
తురిమిన పచ్చి కొబ్బరి - 1 టేబుల్ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
తాలింపుకి నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
టమాటో పల్లీ చట్నీ తయారీ విధానం
-ముందుగా ఉల్లిపాయ, టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, వేరుశెనగలు, చిన్న అల్లం ముక్క వేసి వేయించాలి. వేరుశెనగలు లేత బంగారు రంగులోకి మారి, కమ్మటి సువాసన వస్తున్న సమయంలో వాటిని నూనెలోంచి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలిన నూనెలో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగలు, ఎండు మిరపకాయలు, అల్లం వేసి ముందుగా మెత్తని పొడిలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులోనే చల్లారిన టమాటా-ఉల్లిపాయ మిశ్రమం, తురిమిన కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లా కమ్మని చట్నీని రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-ఒక చిన్న కడాయిలో తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు, మినపపప్పు వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేసి వేయించి ఆ పోపును తీసుకువెళ్లి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే టమాటో పల్లీ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
