Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే!
ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మన ఆరోగ్యానికి అత్యంత కీలకమైనది. రోజూ తినే ఇడ్లీ, దోశలకు బదులుగా రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే, ముఖ్యంగా ప్రోటీన్ పుష్కలంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ కోసం మీరు చూస్తున్నారా? అయితే ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ సూచించిన పెసరపప్పు ఉత్తప్పం మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ వంటకం నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. కమ్మని కొబ్బరి చట్నీతో తింటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

పెసర ఉత్తప్పం తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 1 కప్పు
అల్లం - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - గుప్పెడు
జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
మిరియాలు - 12
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - 1 టీస్పూన్
బేకింగ్ సోడా- 1 టీస్పూన్
నీరు - ముప్పావు కప్పు
నూనె - కాల్చడానికి సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయలు,కొత్తిమీర -గుప్పెడు
చొప్పున
కొబ్బరి చట్నీ తయారీకి కావాల్సినవి
కొబ్బరికాయ (చిన్నది) - 1
చింతపండు గుజ్జు - కొద్దిగా
పచ్చిమిర్చి - 1
అల్లం - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 8
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
నీరు - తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఇంగువ - అర టీస్పూన్
ఎండుమిర్చి - 2
జీలకర్ర - అర టీస్పూన్
ఆవాలు- 1 టీస్పూన్
మినపప్పు-1 టీస్పూన్
శనగపప్పు -1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - రుచికి తగినంత
పెసర ఊతప్పం తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో కడిగిన పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, శనగపిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, పంచదార వేయండి. ఈ మిశ్రమం మరీ పల్చగా కాకుండా ఉత్తప్పం పోయడానికి వీలుగా ఉండేలా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోండి. పిండి తేలికగా మారే వరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు ఉత్తప్పం వేయడానికి సరిగ్గా ముందు మాత్రమే పిండిలో బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. కొద్దిగా నూనె రాసి, తయారు చేసి పెట్టుకున్న పిండిని మందంగా పోసి సమానంగా పరచండి. దీని పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్, కొత్తిమీర ముక్కలను చల్లండి. అంచుల వెంబడి కొద్దిగా నూనె వేసి ఒకవైపు ఎర్రగా కాలేలా ఉడికించండి. తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పి, కూరగాయల వైపు కూడా కాస్త ఉడికేలా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే పెసర ఊతప్పం రెడీ.
కొబ్బరి చట్నీ తయారీ విధానం
-మిక్సీలో పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, అల్లం, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, తగినన్ని నీళ్లు పోసి మెత్తని చట్నీలా రుబ్బుకోండి.
-చట్నీకి తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఈ వేడి వేడి పోపును చట్నీలో వేసి కలుపుకుంటే కమ్మని చట్నీ రెడీ.
కూరగాయల టాపింగ్ తో ఆకర్షణీయంగా కనిపించే వేడి వేడి పెసరపప్పు ఉత్తప్పాన్ని, ఈ తాజా కొబ్బరి చట్నీతో అద్దుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications