Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫుడ్ లవర్స్ ని ఫిదా చేస్తున్న కొత్తిమీర పొంగల్.. టేస్ట్ చూశారా?
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో పొంగల్ అనేది కేవలం ఒక వంటకం కాదు, అది ఒక ఎమోషన్. సాధారణంగా మనం మిరియాల పొంగల్ లేదా చక్కెర పొంగల్ గురించి వినుంటాం. కానీ ఈ మధ్యకాలంలో చెన్నై, కోయంబత్తూర్ వంటి నగరాల్లోని పెద్ద పెద్ద కేటరింగ్ సర్వీసుల్లో కొత్తిమీర పొంగల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. నోరూరించే ఈ వంటకం ఇప్పుడు ఫుడ్ లవర్స్ కి ఫేవరెట్ గా మారింది.
దీనిని గ్రీన్ పొంగల్ అని కూడా పిలుస్తున్నారు. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొత్తిమీర పొంగల్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పెసరపప్పు
-కొత్తిమీర
-జీడిపప్పు
-కరివేపాకు
-నెయ్యి
-ఆయల్
-ఉప్పు
-పచ్చిమిరపకాయలు
-మిరియాలు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం, పావు కప్పు బియ్యం వేసి కడిగి నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో గంటసేపు నానబెట్టిన బియ్యం,పెసరపప్పు, 3 కప్పుల నీళ్లు పోసి ఇందులోనే ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఆయిల్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 4-5 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది.
-ఉడికినదాన్ని గరిటతో లైట్ గా మెదుపుకొని అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి తక్కువ మంట మీద 2 నిమిషాలు వదిలేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది.
-తర్వాత మిక్సీ గిన్నెలో కప్పుంబావు సన్నని కొత్తిమీర తరుగు కాడలతో సహా, 3 కారం గల పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన ఉంచండి.
-తర్వాత తాలింపుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 7 టేబుల్ స్పూన్ల నూనె, టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి చిట్లనివ్వాలి.
-మిరియాలు చిట్లిన తర్వాత అందులో పిడికెడు జీడిపప్పు వేసి మీడియం మంట మద ఎర్రగా వేయించాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనిచ్చాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగు వేసి వేగి పొంగిన తర్వాత ఇందులోనే పావు టీస్పూన్ ఇంగువ వేసి కలపండి.
-ఇంగువ వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర మిశ్రమం వేసి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది.
-తర్వాత ఈ తాలింపుని ఉడికించిన అన్నం పప్పు మిశ్రమంలో వేసి కలపాలి.
-ఇప్పుడు రెండో తాలింపు పెట్టాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో కొద్దిగా ఇంగువ వేసి పొంగించాక 2 రెమ్మల కరివేపాకు వేసి వేపి ఆ తర్వాత పొంగల్ మీద ఈ మొత్తం తాలింపుని పోసి కలపండి. అంతే కొత్తిమీర పొంగల్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications