Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రెగ్యులర్ టమోటా రైస్ బోర్ కొట్టిందా? అయితే ఈ గిల్లి బిర్యానీ ట్రై చేయండి
రెగ్యులర్ టమోటా రైస్ కంటే ఎంతో రుచిగా, బిర్యానీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే టమోటా గిల్లి బిర్యానీని ఒకసారి రుచి చూడండి. తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గిల్లి బిర్యానీ చేయడం చాలా సులభం.
సాధారణ బిర్యానీకి, దీనికి తేడా ఏమిటంటే.. ఇందులో మనం ప్రత్యేకంగా తయారు చేసుకున్న టమోటా పేస్ట్ వాడటం వల్ల రైస్ కి మంచి రంగు, రుచి వస్తాయి.

కావలసిన పదార్థాలు
చిట్టి ముత్యాల బియ్యం- 2 కప్పులు
పెద్ద టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 8
కాశ్మీరీ ఎండుమిర్చి - 3
నూనె - 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
లవంగాలు - 2
రాతి పువ్వు - కొద్దిగా
బిర్యానీ ఆకు - 1
ఏలకులు - 2
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పుదీనా - ఒక గుప్పెడు
బిర్యానీ మసాలా - 1 టేబుల్ స్పూన్
నీరు - మూడున్నర కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి, మంచి నీళ్ళు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. నీరు వేడెక్కాక అందులో 2 పెద్ద టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, కాశ్మీరీ ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు బాగా మరిగించండి.
-టమోటా తొక్క ఊడివచ్చేలా ఉడికిన తర్వాత వాటిని నీటి నుండి తీసి చల్లార్చండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోండి.
-ఇప్పుడు కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఏలకులు, రాతి పువ్వు వేసి వేయించండి. సువాసన రాగానే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగాక, తాజా పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి.
- తర్వాత ముందుగా రుబ్బుకున్న టమోటా మిర్చి పేస్ట్, ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలపండి. నూనె పైకి తేలే వరకు 1-2 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత మూడున్నర కప్పుల నీళ్లు (ఒక కప్పు బియ్యానికి 1.75 కప్పుల నీరు చొప్పున) పోసి మరిగించండి.
-నీరు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్లో వేసి ఒకసారి మెల్లగా కలపండి. నీరు కాస్త ఇగిరిపోయి, బియ్యం కనిపించే దశకు వచ్చాక కుక్కర్ మూత పెట్టండి.
-మంటను సిమ్ లో పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆపేయండి. కుక్కర్ ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే.. వేడి వేడి టమోటా గిల్లి బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications