Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే!
ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే బిర్యానీ లేదా చికెన్ కర్రీ కాకుండా, కాస్త వెరైటీగా, ఎంతో రుచిగా ఉండే వంటకం కోసం చూస్తున్నారా? అయితే చికెన్, శనగల అద్భుతమైన కలయికతో చేసే చికెన్ చెన్నా పులావ్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది తయారు చేయడం చాలా సులువు, దీని గుమగుమలు మీ ఇంటిల్లిపాదిని డైనింగ్ టేబుల్ దగ్గరకు పరిగెత్తిస్తాయి. చికెన్ చెన్నా పులావ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చికెన్ చెన్నా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 1 కప్పు
చికెన్ - 250 గ్రాములు
ఉడికించిన కాబూలీ శనగలు (చెన్నా)- అర కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
టమాటా - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 3
బిర్యానీ ఆకు-1
చిన్న దాల్చిన చెక్క-1
లవంగాలు- 4
మిరియాలు-3 లేదా 4, యాలకులు-1
ఉప్పు - రుచికి సరిపడా (సుమారు 1 టీస్పూన్)
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్
నీళ్లు - 2 కప్పులు
చికెన్ చెన్నా పులావ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత బంగారు రంగులోకి మారేంతవరకు వేయించాలి. ఆ తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసి మంచి సువాసన వచ్చేలా కాసేపు వేయించండి.
-ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఒకటి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలతో పాటు పొడి మసాలాలు (ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్) అన్నీ వేసి బాగా కలపాలి. టమాటాలు మెత్తగా గుజ్జులా మారేంతవరకు ఉడికించాలి.
-తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. చికెన్ రంగు మారి, కాస్త ఉడికే వరకు వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలు వేసి, కూరలోంచి నూనె పైకి తేలేంతవరకు సన్నటి మంట మీద ఉడికించాలి.
-తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి, అందులో 2 కప్పుల నీళ్లు పోయాలి.
నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు
బాస్మతి బియ్యాన్ని అందులో వేసి మంటను మీడియంలో ఉంచాలి. గిన్నెలోని
నీరంతా దాదాపుగా ఇగిరిపోయే వరకు ఉడికించాలి.
చివరగా గిన్నెపై మూత గట్టిగా పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి సుమారు
10 నిమిషాల పాటు దమ్ చేయాలి.
-బియ్యం పొడిపొడిలాడుతూ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. గుమగుమలాడే చికెన్ చెన్నా పులావ్ రెడీ.
స్పెషల్ రైతా తయారీ విధానం
-మిక్సీ జార్ లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసం వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.
-ఒక గిన్నెలో గడ్డ పెరుగు తీసుకుని, అందులో ఈ పుదీనా-కొత్తిమీర
పేస్ట్ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన కీరదోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, రుచికి
సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని కలుపుకోవాలి.
-వేడివేడిగా ఉండే చికెన్ చెన్నా పులావ్‌ను, ఈ చల్లటి స్పెషల్ రైతాతో కలిపి తింటే ప్రతి ముద్దా అమృతమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications