Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో..
ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయలే. మామిడి పండ్ల సీజన్ మొదలవగానే ప్రతి తెలుగు వారి వంటగదిలో రకరకాల ప్రయోగాలు మొదలవుతాయి. పుల్లపుల్లని మామిడికాయ పప్పు, కమ్మని మామిడికాయ సాంబార్, ఘాటైన మామిడి తురుము పచ్చడి, నోరూరించే ఆవకాయ.. ఇలా ఎన్నో రకాల వంటకాలను మనం తరచుగా తయారు చేసుకుంటూనే ఉంటాం. అయితే ఎప్పుడూ చేసుకునే రొటీన్ వంటకాలకు భిన్నంగా, కాస్త వెరైటీగా ఏదైనా ట్రై చేయాలని మీకు అనిపిస్తోందా?

మీ ఇంట్లో మామిడికాయతో పాటు ఓ క్యారెట్ కూడా ఉందా? అయితే వాటితో ఓ అద్భుతమైన, రుచికరమైన క్యారెట్ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోండి. మామిడికాయలోని పులుపు, క్యారెట్ లోని సహజమైన తీపి, వెల్లుల్లి ఘాటు కలిసి ఈ పచ్చడికి ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే.. ఆ రుచి జన్మలో మర్చిపోలేరు. అంతేకాదు, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీ వంటి ఎలాంటి టిఫిన్స్ లోకైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.
క్యారెట్ మామిడికాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
క్యారెట్ - 1
పచ్చి మామిడికాయ - సగం
వెల్లుల్లి రెబ్బలు - 5
కారం - అర టీస్పూన్
నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు - 2 చిటికెలు
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - రుచికి సరిపడా

క్యారెట్ మామిడికాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా క్యారెట్ ను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసేయాలి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి నీళ్లు పోయకుండా ఒక్కసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు పుల్లటి మామిడికాయను తీసుకుని, దాని పైన చెక్కు తీసి, సగం భాగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను గ్రైండ్ చేసిన క్యారెట్ మిశ్రమంలో వేయాలి. దీనికి తోడుగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కాస్త బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టుకోవాలి. అందులో పచ్చడికి కమ్మని సువాసననిచ్చే నువ్వుల నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
-ఆవాలు వేగిన తర్వాత, అందులో పసుపు, ఎండు మిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఆ వెంటనే తాజా కరివేపాకు వేసి దోరగా వేయించాక ఈ తాలింపులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ మామిడికాయ మిశ్రమాన్ని వేయాలి. దీనికి ఉప్పును కూడా జత చేసి బాగా కలిపి మంటను సిమ్ లో ఉంచి గరిటెతో బాగా కలుపుతూ ఉడికించాలి.
-పచ్చడిలోని పచ్చివాసన పోయి, నూనె పైకి తేలే వరకు సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. అంతే నూనె పైకి తేలుతూ, చూడగానే నోరూరించే కమ్మటి క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ. చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications