Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
న్యూట్రిషన్ పవర్ ప్యాక్..కళ్లకు విందు,కడుపుకు ఆరోగ్యం ఇచ్చే రెయిన్ బో ఇడ్లీ
దక్షిణ భారత ఆహారంలో ఇడ్లీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన అల్పాహారాలలో ఇడ్లీ ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే రోజూ తినే తెల్లటి ఇడ్లీలను చూసి పిల్లలు బోర్ ఫీలవుతుంటారు. ముఖ్యంగా పిల్లలు కూరగాయలు తినడానికి మారం చేస్తుంటారు.
అటువంటి వారికి రుచితో పాటు ఆరోగ్యాన్ని, ఆకర్షణీయమైన రంగులను జోడించి చేసేదే ఈ రెయిన్ బో ఇడ్లీ. కృత్రిమ రంగులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన కూరగాయలను ఉపయోగించి ఈ ఇడ్లీలను తయారు చేయడం వల్ల ఇవి అమితమైన పోషకాలను అందిస్తాయి. రెయిన్ బో ఇడ్లీలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఇడ్లీ పిండి
-బీట్ రూట్ పేస్ట్
-పాలకూర పేస్ట్
-క్యారెట్ పేస్ట్
-చిటికెడు పసుపు
-సరిపడా ఉప్పు
తయారీ విధానం
-క్యారెట్ ను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. లేదా పచ్చి క్యారెట్ ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
-బీట్ రూట్ ను చెక్కు తీసి ముక్కలు కోసి ఉడికించి పేస్ట్ చేయాలి.
-పాలకూరను వేడి నీటిలో 2 నిమిషాలు ఉంచి వెంటనే చల్లని నీటిలో వేయాలి. తర్వాత దాన్ని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కతో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
-ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని నాలుగు లేదా ఐదు వేర్వేరు గిన్నెలలో సమానంగా తీసుకోండి.
-ఒక్కో గిన్నెలో ఒక్కో రకమైన కూరగాయ పేస్ట్ (బీట్రూట్, పాలకూర, క్యారెట్) కలపండి. ఒక గిన్నెలో పసుపు కలపండి. కావాలంటే ఒక గిన్నెలో పిండిని తెల్లగానే ఉంచొచ్చు. ఇప్పుడు మీ ముందు రంగురంగుల ఇడ్లీ పిండి సిద్ధంగా ఉంటుంది.
-ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి ఒక స్పూన్ ఆకుపచ్చ పిండి, దానిపై నారింజ పిండి, మధ్యలో తెల్ల పిండి.. ఇలా పొరలు పొరలుగా వేయవచ్చు లేదా ప్లేటులో సగం ఒక రంగు, మరో సగం ఇంకో రంగు వేయవచ్చు.
-ఈ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో పెట్టి 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్ లేదా కత్తితో గుచ్చి చూడండి. పిండి అంటుకోకపోతే వేడి వేడి ఇడ్లీలు రెడీ.
-ఈ కలర్ ఫుల్ ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా వేడి వేడి సాంబార్ తో వడ్డిస్తే అద్భుతంగా ఉంటాయి. పిల్లల లంచ్ బాక్సుల్లోకి, పుట్టినరోజు పార్టీలకు లేదా వీకెండ్ లో స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ గా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications