పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!

Posted By:

చపాతీ, పూరీల్లోకి ఎప్పుడూ ఒకే రకమైన బంగాళదుంప కుర్మాను తిని బోర్ కొట్టిందా? రొటీన్ రుచులకు భిన్నంగా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఉందా? అయితే నీలగిరి వెజ్ కుర్మా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే. బ్రిటిష్ వారి కాలంలో నీలగిరి కొండల్లో పుట్టిన ఈ వంటకం.. అక్కడి తాజా కూరగాయలు, సుగంధ ద్రవ్యాల కలయికతో ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఇది కేవలం చపాతీ, పూరీలకే కాదు దోశ, పరోటాల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ ఘుమఘుమలాడే, కమ్మని నీలగిరి వెజ్ కుర్మాను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

British Era Secret Recipe How to Make Nilgiri Veg Kurma at Home in Telugu

నీలగిరి వెజ్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు

గ్రీన్ పేస్ట్ కోసం

యాలకులు - 2
లవంగాలు - 2
సోంపు - పావు టీస్పూన్
కొత్తిమీర - ఒక గుప్పెడు
పుదీనా - ఒక గుప్పెడు
పచ్చిమిర్చి - 5
అల్లం - అర అంగుళం ముక్క
వెల్లుల్లి - 5 రెబ్బలు
నీళ్లు - అర కప్పు

వైట్ పేస్ట్ కోసం

గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 15
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
నీళ్లు - అర కప్పు

కూర తయారీకి

కొబ్బరి నూనె - 1 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
సోంపు - పావు టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉల్లిపాయ - 1 పెద్దది
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి బఠానీలు - అర కప్పు
బంగాళదుంప ముక్కలు - అర కప్పు
క్యారెట్, బీన్స్ ముక్కలు - చెరో పావు కప్పు
చిక్కటి పెరుగు - అర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
కొత్తిమీర - కొద్దిగా

వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..

నీలగిరి వెజ్ కుర్మా తయారీ విధానం

-ముందుగా మిక్సీ జార్‌ లో యాలకులు, లవంగాలు, సోంపు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి మెత్తని గ్రీన్ పేస్ట్‌ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఒక చిన్న గిన్నెలో గసగసాలు, జీడిపప్పు వేసి నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని కొబ్బరి తురుముతో కలిపి మిక్సీలో మెత్తని వైట్ పేస్ట్‌ లా రుబ్బి పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, కొబ్బరి నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక సోంపు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్, ఉప్పు వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం వేయించాలి.

-ఇప్పుడు క్యారెట్, బీన్స్, బంగాళదుంప, బఠానీలు వేసి బాగా కలపాలి. అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి, మీడియం మంట మీద కూరగాయలను 10 నిమిషాల పాటు ఉడికించాలి.

-కూరగాయలు ఉడికిన తర్వాత, చిక్కటి పెరుగును ఉండలు లేకుండా గిలకొట్టి అందులో కలపాలి. వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు-కొబ్బరి (వైట్) పేస్ట్ కూడా వేసి కలపాలి.

-మిక్సీ జార్‌ ను కడిగి మరో కప్పు నీళ్లు పోసుకోవాలి. కుర్మా మరీ చిక్కగా ఉంటే మరికొన్ని నీళ్లు, ఉప్పు సరిచూసుకుని కలుపుకోవాలి.

-చివరగా పాన్‌ పై మూతపెట్టి మరో 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి.

-ఇల్లంతా సువాసన రావడం మొదలవ్వగానే, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే నోరూరించే నీలగిరి వెజ్ కుర్మా రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 5, 2026, 11:47 [IST]
Desktop Bottom Promotion