Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చపాతీ, పూరీల్లోకి ఎప్పుడూ ఒకే రకమైన బంగాళదుంప కుర్మాను తిని బోర్ కొట్టిందా? రొటీన్ రుచులకు భిన్నంగా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఉందా? అయితే నీలగిరి వెజ్ కుర్మా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే. బ్రిటిష్ వారి కాలంలో నీలగిరి కొండల్లో పుట్టిన ఈ వంటకం.. అక్కడి తాజా కూరగాయలు, సుగంధ ద్రవ్యాల కలయికతో ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఇది కేవలం చపాతీ, పూరీలకే కాదు దోశ, పరోటాల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ ఘుమఘుమలాడే, కమ్మని నీలగిరి వెజ్ కుర్మాను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

నీలగిరి వెజ్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
గ్రీన్ పేస్ట్ కోసం
యాలకులు - 2
లవంగాలు - 2
సోంపు - పావు టీస్పూన్
కొత్తిమీర - ఒక గుప్పెడు
పుదీనా - ఒక గుప్పెడు
పచ్చిమిర్చి - 5
అల్లం - అర అంగుళం ముక్క
వెల్లుల్లి - 5 రెబ్బలు
నీళ్లు - అర కప్పు
వైట్ పేస్ట్ కోసం
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 15
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
నీళ్లు - అర కప్పు
కూర తయారీకి
కొబ్బరి నూనె - 1 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
సోంపు - పావు టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉల్లిపాయ - 1 పెద్దది
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి బఠానీలు - అర కప్పు
బంగాళదుంప ముక్కలు - అర కప్పు
క్యారెట్, బీన్స్ ముక్కలు - చెరో పావు కప్పు
చిక్కటి పెరుగు - అర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
కొత్తిమీర - కొద్దిగా
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
నీలగిరి వెజ్ కుర్మా తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో యాలకులు, లవంగాలు, సోంపు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి మెత్తని గ్రీన్ పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఒక చిన్న గిన్నెలో గసగసాలు, జీడిపప్పు వేసి నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని కొబ్బరి తురుముతో కలిపి మిక్సీలో మెత్తని వైట్ పేస్ట్ లా రుబ్బి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, కొబ్బరి నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక సోంపు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్, ఉప్పు వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం వేయించాలి.
-ఇప్పుడు క్యారెట్, బీన్స్, బంగాళదుంప, బఠానీలు వేసి బాగా కలపాలి. అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి, మీడియం మంట మీద కూరగాయలను 10 నిమిషాల పాటు ఉడికించాలి.
-కూరగాయలు ఉడికిన తర్వాత, చిక్కటి పెరుగును ఉండలు లేకుండా గిలకొట్టి అందులో కలపాలి. వెంటనే ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు-కొబ్బరి (వైట్) పేస్ట్ కూడా వేసి కలపాలి.
-మిక్సీ జార్ ను కడిగి మరో కప్పు నీళ్లు పోసుకోవాలి. కుర్మా మరీ చిక్కగా ఉంటే మరికొన్ని నీళ్లు, ఉప్పు సరిచూసుకుని కలుపుకోవాలి.
-చివరగా పాన్ పై మూతపెట్టి మరో 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
-ఇల్లంతా సువాసన రావడం మొదలవ్వగానే, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే నోరూరించే నీలగిరి వెజ్ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications