Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్..ఇక బయట అస్సలు కొనరు!
బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటిలో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అందుకే ఎంతో ఆరోగ్యకరంగా, రుచికరంగా ఇంట్లోనే ఐస్ క్రీం తయారు చేసుకుంటే కుటుంబమంతా సంతోషంగా ఆస్వాదించవచ్చు.
ఐస్ క్రీమ్స్ లలో అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్లేవర్ బటర్ స్కాచ్. బేకరీల్లో, ఐస్ క్రీం పార్లర్లలో ఎంతో ఇష్టంగా తినే ఈ బటర్ స్కాచ్ ఐస్‌క్రీమ్ ను, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చిక్కటి పాలు - అర లీటరు
చక్కెర - రుచికి సరిపడా (సుమారు అర కప్పు)
బాదం పప్పులు - 15
జీడిపప్పు - 15
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్) - 2 టేబుల్ స్పూన్లు
వెన్న లేదా నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో పావు కప్పు చక్కెర వేసి సన్నటి మంటపై కరిగించాలి. నీళ్లు పోయకూడదు. చక్కెర దానంతట అదే కరిగి ఎర్రటి కారామెల్ రంగులోకి మారుతుంది. ఇప్పుడు అందులో ఒక చెంచా వెన్న లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసి వేయించాక స్టవ్ ఆపేయండి
-ఒక స్టీల్ ప్లేట్ కు లేదా బటర్ పేపర్ కు నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులో పోసి పలచగా పరవాలి. ఇది పూర్తిగా చల్లారాక గట్టిగా తయారవుతుంది. అప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే బటర్‌స్కాచ్ ఐస్ క్రీమ్‌కు అసలైన క్రంచీ రుచిని ఇస్తుంది.
-ఇప్పుడు మిక్సీ జార్ లో బాదం, కొన్ని జీడిపప్పులు వేసి మెత్తటి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అర లీటరు పాలు పోసి బాగా మరిగించాలి. మరోవైపు ఒక చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) తీసుకుని అందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
-స్టవ్ మీద పాలు బాగా మరుగుతున్నప్పుడు అందులో మిగిలిన చక్కెర, ముందుగా చేసుకున్న బాదం-జీడిపప్పు పొడి వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తర్వాత కార్న్ ఫ్లోర్ కలిపిన పాల మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. రెండు నిమిషాల్లో పాలు చిక్కబడి క్రీమ్ లాగా మారుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన పాల మిశ్రమంలో ముందుగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర-జీడిపప్పు క్రంచ్ ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో పోసి, మూత గట్టిగా పెట్టి డీప్ ఫ్రిజ్ లో రాత్రంతా ఉంచాలి.
-ఉదయం లేచి చూసేసరికి బటర్ స్కాచ్ ఐస్ క్రీం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications