Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే
ప్రతిరోజూ తినే రొటీన్ దోశలకు భిన్నంగా, రుచితో పాటు శరీరానికి కావాల్సిన బోలెడన్ని పోషకాలను ఒకేసారి అందించే అద్భుతమైన వంటకం పెసర కొత్తిమీర దోశ. దీని అద్భుతమైన రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇది కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, మనసుకు ఆనందాన్ని, శరీరానికి శక్తిని ఇచ్చే ఒక సంపూర్ణ పౌష్టికాహారం.

పెసర కొత్తిమీర దోశ తయారీకి కావలసిన పదార్థాలు
పెసర పప్పు - 1 కప్పు (పొట్టు తీసినవి లేదా పొట్టుతో ఉన్నవి)
కొత్తిమీర - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 7 నుండి 8
అల్లం - 3 అంగుళాల ముక్క
జీలకర్ర - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - పిండి రుబ్బడానికి తగినన్ని
నూనె లేదా నెయ్యి - దోశలు కాల్చడానికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు - కొన్ని
పెసర కొత్తిమీర దోశ తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కనీసం 4 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. మీకు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా కావాలంటే, రాత్రే పప్పును నానబెట్టుకోవడం ఉత్తమం.
-నానిన పెసరపప్పులోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, కడిగి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 3 అంగుళాల అల్లం ముక్క, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ పసుపు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. సాధారణ దోశ పిండిలాగే మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా తగినన్ని నీళ్లు కలుపుకుంటూ సరైన కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ లేదా ఇనుప పెనం పెట్టాలి. పెనం బాగా వేడెక్కాక, మంటను మీడియంలో పెట్టి, గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి, గుండ్రంగా, పలచగా అంచుల వరకు విస్తరించాలి.
-దోశ పైన పచ్చిదనం కొద్దిగా తగ్గగానే ఉల్లిపాయ ముక్కలు వేసి దోశ అంతటా సమానంగా చల్లాలి. గరిటెతో ఆ ముక్కలను దోశకు కొద్దిగా అద్దాలి.
-దోశ అంచుల వెంబడి, పైన ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి దోశ కింది భాగం ఎర్రగా, కరకరలాడేలా వేగే వరకు కాల్చాలి. ముక్కలు వేసిన వైపు తిప్పాల్సిన అవసరం లేదు. అంతే పెసర కొత్తిమీర దోశ రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు
-పెసర పప్పులో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినని వారికి ఇది బెస్ట్ ప్రొటీన్ సోర్స్. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు, తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం.ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చాలా సురక్షితం.
- కొత్తిమీరను పిండిలో రుబ్బి తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. కొత్తిమీరలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, కంటిచూపును మెరుగుపరుస్తుంది, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications