Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
క్యాబేజీ నిల్వ పచ్చడి..ఓసారి తిన్నాక వదిలిపెడితే ఒట్టు..ఎలా చేసుకోవాలంటే
మీరెప్పుడైనా క్యాబేజీ నిల్వ పచ్చడి తినారా? ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలని అడగడం మాత్రం గ్యారెంటీ. ఇది రుచికరమైనదే కాదండోయ్..పోషకాలకు కూడా కలిగి ఉంటుంది. దీనిని తయారుచేసుకోవడం చాలా సులభం కూడా, ఇది చాలా కాలంపాటు నిల్వ ఉంటుంది. అన్నం, చపాతీ లేదా ఇతర ఆహారాలతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబేజీ నిల్వ పచ్చడి తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
క్యాబేజీ నిల్వ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
క్యాబేజీ - 1 పెద్దది
ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
మెంతులు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - 1/2 కప్పు
ఉప్పు - 1/4 కప్పు
పసుపు - 1 టీస్పూన్
కారం - 2-3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10-12
ఇంగువ - 1/4 టీస్పూన్
నిమ్మరసం - 2-3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 2 రెమ్మలు
క్యాబేజీ నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
-కాండం తీసివేసి క్యాబేజీని సన్నని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా ఉండకూడదు.
-కట్ చేసిన క్యాబేజీ ముక్కలను ఒక పెద్ద గిన్నెలో వేయాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి క్యాబేజీ ముక్కలకు బాగా పట్టేలా చేతులతో కలపాలి.
-క్యాబేజీని మూతపెట్టి కనీసం 4-6 గంటలు లేదా రాత్రంతా నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల క్యాబేజీలోని నీరు బయటకు వచ్చి ముక్కలు మెత్తబడతాయి, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
-ఇప్పుడు ఓ బాండీలో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చిటపటలాడటం మొదలు పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
-వేయించిన మసాలా దినుసులను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
-వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి కొద్దిగా దంచాలి లేదా సన్నగా తరుగుకోవాలి.
-నానిన క్యాబేజీని చేత్తో పిండి నీరంతా తీసి వేయాలి. తీసిన నీటిని పారవేయండి.
నీరు తీసిన క్యాబేజీ ముక్కలను ఒక పొడి గిన్నెలో వేయాలి.
ఇందులో ముందుగా తయారుచేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలపాలి. కారం మీ రుచికి తగినంత వేసుకోవచ్చు.
తరిగిన లేదా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ కూడా వేసి కలపాలి.
పంజాబ్ స్పెషల్ 'కుల్చా'..అదుర్స్ అంతే..మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
-మీరు నిమ్మరసం వేయాలనుకుంటే ఈ సమయంలో వేసి కలపవచ్చు. నిమ్మరసం పచ్చడికి పులుపు రుచిని ఇవ్వడమే కాకుండా నిల్వ ఉండటానికి కూడా సహాయపడుతుంది.
-ఇఫ్పుడు ఒక చిన్న బాండీలో ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నూనెను కొద్దిగా చల్లారనివ్వాలి.
-నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిని క్యాబేజీ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. నూనె పచ్చడి అంతటా సమానంగా వ్యాపించేలా కలపాలి.
-మీరు కరివేపాకు వేయాలనుకుంట, నూనె వేడి చేసేటప్పుడు వేసి చిటపటలాడనివ్వవచ్చు.
-తయారైన క్యాబేజీ పచ్చడిని శుభ్రమైన, పొడి గాజు సీసా లేదా జాడీలో నింపాలి. సీసా పూర్తిగా పొడిగా ఉండాలి, లేకపోతే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది.
-పచ్చడిని సీసాలో గట్టిగా నొక్కాలి, పైన కొద్దిగా నూనె ఉండేలా చూసుకోవాలి. నూనె పచ్చడిని గాలి తగలనివ్వకుండా కాపాడుతుంది.
-సీసాకు మూత గట్టిగా బిగించి ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ పచ్చడి సాధారణంగా 2-3 వారాల వరకు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











