Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
ఫైబర్, కాల్షియం వంటి పుష్కలంగా రాగి సమోసా..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి
వేడివేడిగా, కరకరలాడుతూ ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది సమోసా. కానీ బయట దొరికే మైదాతో చేసిన సమోసాలు తరచుగా తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే సమోసా తినాలనే కోరికను చంపుకోకుండా, అదే సమయంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన రెసిపీ రాగి సమోసా. రాగి పిండితో చేసే ఈ సమోసా ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. హెల్తీ అండ్ టేస్టీ రాగి సమోసాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి సమోసా తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - ఒక కప్పు
వంట నూనె - అర కప్పు
ఉప్పు - రుచికి తగినంత
వాము - అర టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
బంగాళాదుంపలు - మూడు
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
ఆవాలు - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా - ఒక టేబుల్ స్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్
రాగి సమోసా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో ఒక కప్పు రాగి పిండి వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, వాము, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా గోరువెచ్చని నీరు పోస్తూ, పిండిని కాస్త గట్టిగా ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక, ముందుగానే ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దీనికి తగినంత కారం, గరం మసాలా, ఉప్పు జతచేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని దించేయాలి.
-ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని పూరీలాగా కాస్త పలుచగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న దానిని మధ్యలోకి (సగం భాగానికి) కట్ చేయాలి. కట్ చేసిన సగ భాగాన్ని తీసుకుని చేతిలో కోన్ (శంఖువు) ఆకారంలో మడవాలి. ఆ కోన్ లోపల మనం తయారు చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని ఉంచాలి.
-స్టఫింగ్ బయటకు రాకుండా అంచుల వెంబడి కొద్దిగా నీళ్లు రాసి, సమోసా ఆకారంలో గట్టిగా మూసేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి నూనె కాగాక ఈ రాగి సమోసాలను అందులో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, కరకరలాడేలా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతేరాగి సమోసా రెడీ. టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications