Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
కాలీఫ్లవర్ మసాలా కర్రీ.. ముద్దముద్దలో మజా! ఇలా చేసుకుంటే రుచి అద్భుతహః
కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాలీఫ్లవర్‌తో చేసే వంటలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తినడం వల్ల శరీరానికి తగిన శక్తి లభించడంతో పాటు శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ కూడా అందిస్తాయి. ఈ కాలీఫ్లవర్స్ చలికాలంలో ఎక్కువగా పండుతాయి. కాబట్టి చలికాలంలో ఎక్కువగా దీనితో కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేసుకుంటారు. దీనిని ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
కాలీఫ్లవర్ - 1 ముక్క (చిన్న ముక్కలుగా కోసి, ఉప్పు నీటిలో కడిగి
పక్కన పెట్టుకోండి)
ఉల్లిపాయ - 1 (తరిగినది)
తోమటోలు - 2 (తరిగినవి)
పచ్చిమిర్చి - 2-3 (చిన్న ముక్కలుగా తరిగినవి)
ఇంగువ - 1/2 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్
కొత్తిమీర పొడి - 1/2 టీస్పూన్
కారం - రుచికి తగినంత
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కసూరి మేతి - 1/2 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
తయారీ విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్‌లో టమాటోలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక పెనం తీసుకోవాలి. అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడైన తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఆ ఉల్లియాపాయల మిశ్రమంలో ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కొంచెం నీరు పోసి బాగా కలుపుకొని, వేయించుకోవాలి. అలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తరువాత.. అందులో కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఆ తరువాత ఆ మసాలాలు కాలీఫ్లవర్‌కు పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ పెనంపై మూత పెట్టి ఒక అయిదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఆ తరువాత ఆ కూరలో కారం పొడి, కొత్తిమీర, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా దానిపైన కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ మసాలా కర్రీ సిద్ధమైనట్లే. దీనిని జొన్న రోటీ, పరోటా, అన్నంతో కలుపుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications