Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Egg Roast: గుడ్డుతో ఈ రెసిపీ ట్రై చేయండి.. లొట్టలేసుకుని అన్నం తినాల్సిందే.. నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే?
వంటింట్లో గుడ్డు ఒక వరం అనే చప్పుకోవాలి. ఈ గుడ్డుతో ఎలాంటి వంటకం చేసినా ఆహా అనాల్సిందే. గుడ్డు పులుసు నుంచి ఆమ్లెట్ వరకు ఏది తిన్నా.. ఇంకోసారి చేసుకొని తినాల్సిందే. ఏ గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే గుడ్డు చాలా తొందరగా జీర్ణం అవడం వల్ల ఎలాంటి ఆనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరవు. అంతటి ఆరోగ్యకరమైన ఈ గుడ్డుతో చాలా సులభంగా, కేవలం నిమిషాల్లోనే ఎగ్ రోస్ట్ చేసుకోవచ్చు. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా ఆ ఎగ్ రోస్ట్ తయారు చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎగ్ రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- నాలుగు ఉడికించిన గుడ్లు
- పావు కప్పు చీజ్
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పేస్ట్
- ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్
- రుచికి సరిపడా ఉప్పు
- అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి
- అర టేబుల్ స్పూన్ కారం
- పావు టేబుల్ స్పూన్ పసుపు పొడి
- అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా
- అర టేబుల్ స్పూన్ గరం మసాలా
- అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి
- ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి
- రెండు స్పూన్ల పెరుగు
- ఒక స్పూన్ వెన్న
- అర స్పూన్ నిమ్మరసం
- ఒక స్పూన్ కొత్తిమీర తరుగు
ఎగ్ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా నాలుగు కోడిగుడ్లను బాగా ఉడకబెట్టుకొని వాటి పొట్టు తీసుకోవాలి. అనంతరం ఆ కోడిగుడ్డును నాలుగు గాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఎండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కారం, పసుపు, జీలకర్ర పొడి, శనగ పిండి, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా గాట్లు వేసి పెట్టుకున్న కోడి గుడ్లను ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఒక అరగంట సేపు వాటిని మ్యారినేట్ చేసుకోవాలి. అలా అరగంట సేపు గుడ్డు కలిపిన మిశ్రమాన్ని వదిలేయడం వల్ల.. మనం కలిపి పెట్టుకున్న మసాలా గుద్దుకు బాగా పట్టుకుంటుంది.
ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా బటర్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. అందులో గుడ్లు వేసుకొని దానిపై నుంచి మరోసారి బటర్ పోసుకోవాలి. అయితే ఈ గుడ్లు ఫ్రై అయ్యే సమయంలో మంటను మీడియంలో ఉంచుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం గుడ్డును తిప్పి ఇంకో రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. గుడ్డు రెండువైపులా సమానంగా ఉడికినట్లు నిర్ధారించుకోవాలి.
ఇలా ఉడికించుకున్నప్పుడు ప్రతి గుడ్డుపై కచ్చితంగా ఒక చీజ్ ముక్కను ఉంచుకోవాలి. అలాంటప్పుడే ఆ చీజ్ ఫ్లేవర్ నోటికి సరిగ్గా తగులుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి చీజీ ఎగ్ రోస్ట్ తీసుకొని దానిపై నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర ఆకులు, అలాగే రింగ్ ఆనియన్స్ వేసుకుంటే వేడివేడి చీజీ ఎగ్ రోస్ట్ సిద్ధమైనట్లే. దీనిని గ్రీన్ చట్నీలో నంజుకొని తింటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ చీజీ ఎగ్ రోస్ట్‌ని తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications