Latest Updates
-
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా?
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం!
వీకెండ్ లో ఉదయం నిద్రలేవగానే ప్రతి మాంసాహార ప్రియుడి మదిలో మెదిలే మొదటి ప్రశ్న..ఈరోజు స్పెషల్ ఏంటి?. వారమంతా పడే అలసట మొత్తం తీరిపోవాలంటే, వీకెండ్ లో పళ్ళెంలో అదిరిపోయే నాన్ వెజ్ వంటకం ఉండాల్సిందే. ముఖ్యంగా సీఫుడ్ ఇష్టపడేవారికి చేపల వేపుడు అంటే ప్రాణం. అయితే ఎప్పుడూ చేసుకునే రొటీన్ చేపల కూరలకు, మామూలు ఫ్రైలకు కాస్త భిన్నంగా ఈ వారం కొత్తగా చేప వెల్లుల్లి కారం ట్రై చేయండి.
పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా? ఘాటైన వెల్లుల్లి వాసన, కరకరలాడే చేప ముక్కలు, దానికి తోడుగా ఎర్రటి కారం.. ఈ అద్భుతమైన కాంబినేషన్ మీ భోజనాన్ని కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే కళ్లు మూసుకుని ఆస్వాదించేలా చేప వెల్లుల్లి కారం మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చేప వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
చేపలు: 1 కిలో
ఉప్పు: 1 టీస్పూన్
పసుపు: ముప్పావు టీస్పూన్
ఎండు మిరపకాయలు: 20
వెల్లుల్లి రెబ్బలు: 30
ధనియాలు: 2 టీస్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
మెంతులు: పావు టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
నూనె: అర కప్పు
కరివేపాకు: గుప్పెడు
నిమ్మకాయ: 1
చేప వెల్లుల్లి కారం తయారీ విధానం
-ముందుగా 1 కేజీ ప్రెష్ చేప ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకోండి. బాగా కడిగిన చేప ముక్కలను ఒక గిన్నెలో వేయండి. ఇందులోనే అర టీస్పూన్ ఉప్పు, పసుపు వేసి మొత్తం ముక్కలకు బాగా పట్టేలా చేతులతో కలుపుకొని 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోండి.
-తర్వాత వెల్లుల్లి కారం తయారుచేసుకోవడం కోసం..స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు,ఆవాలు వేసి దోరగా వేయించాక చివర్లో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ జార్ లో వేయండి,ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ ఉప్పు, పసుపు వేసి కలిపి కచ్చాపచ్చగా పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడయ్యాక అందులో పక్కన ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం, నూనెలో వేయించిన కరివేపాకు వేసుకొని మొత్తం చేప ముక్కలకు పట్టేలా కలుపుకోండి. చివర్లో కాస్త నిమ్మరం వేసి కలుపుకోండి.
-అంతే చేప వెల్లుల్లి కారం రెడీ.
-వేడి వేడి అన్నంలో ఈ కరకరలాడే ఘాటైన వెల్లుల్లి కారం చేపల వేపుడు కలుపుకుని తింటుంటే.. ఒక్కో ముద్దకూ స్వర్గం కనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
