Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
చెట్టినాడ్ రుచులు మీ వంటింట్లో..కమ్మని,ఘాటైన కొత్తిమీర పచ్చడి..రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సాధారణంగా మన ఇళ్లలో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీ చేస్తుంటాం. కానీ రోజూ అవే రుచులు తింటే ఎవరికైనా బోర్ కొట్టడం సహజం. మీ ఇంట్లో కూడా అదే జరుగుతుందా? అయితే ఈసారి మీ బ్రేక్ ఫాస్ట్ ని మరింత రుచికరంగా మార్చుకోవడానికి చెట్టినాడ్ స్టైల్ కొత్తిమీర చట్నీ ట్రై చేయండి.
ఇది కేవలం సాధారణ కొత్తిమీర చట్నీ కాదు. చెట్టినాడ్ వంటకాలకు ఉండే ప్రత్యేకమైన ఘాటు, రుచి ఇందులో ఉంటాయి. చట్నీ ఒక్కసారి రుచి చూస్తే, మీ ఇంట్లో వాళ్ళు సాధారణంగా తినే ఇడ్లీల కంటే రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. చెట్టినాడ్ కొత్తిమీర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె: 2 టీస్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 3
అల్లం: 1 అంగుళం ముక్క
పుదీనా ఆకులు: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర: 3 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము: 1 కప్పు
జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
చింతపండు: చిన్న రెమ్మ
పచ్చిమిర్చి: 3
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: అర కప్పు
తాలింపుకి నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
కరివేపాకు: ఒక రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పచ్చి వాసన పోయేలా వేగితే చట్నీకి మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు అదే పాన్ లో తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేయండి. ఆకులు మెత్తబడి, దగ్గరకు అయ్యేంత వరకు వేయించండి. కొత్తిమీర మరీ మాడిపోకుండా జాగ్రత్తపడండి. ఆకులు వేగిన తర్వాత స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన కొత్తిమీర మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీనికి పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, చిన్న చింతపండు ముక్క, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేయండి.
-ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాత అర కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. జీడిపప్పు వేయడం వల్ల చట్నీ మంచి చిక్కదనాన్ని, కమ్మని రుచిని పొందుతుంది. రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-చట్నీకి తాలింపుతోనే ఒక చిన్న పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. చివరగా కరివేపాకు వేసి, ఆ సువాసన వచ్చే తాలింపును చట్నీలో కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, కమ్మనైన చెట్టినాడ్ కొత్తిమీర చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీలోకైనా, క్రిస్పీ దోసెలోకైనా, ఊతప్పంలోకైనా ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications