Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చెట్టినాడ్ చేపల ఫ్రై.. టేస్ట్ అదిరిపోతుంది అంతే.. ఎలా చేసుకోవాలంటే?
మాంసాహార ప్రియులకు చేపలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. చేపలతో ఎన్నో రకాల వంటలు చేస్తుంటారు. వాటిలో చేపల పులుసు, చేపల ఫ్రై చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే చెట్టినాడ్ చేపల ఫ్రై అనేది చాలా మందికి ఇష్టముంటుంది. దీనికి సంబంధించిన రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ ఫ్రై చేయటానికి కొంత సమయం పట్టనుంది. దీనికోసం కొంచెం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.
ఈ చెట్టినాడ్ చేపల ఫ్రై చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు కావాలి?, ఏ విధంగా ఈ చెట్టినాడ్ చేపల ఫ్రై చేసుకోవాలి అనేది ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చెట్టినాడ్ చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు..
- చేపలు
- కారం
- పసుపు
- ఉప్పు
- ఉల్లిపాయ
- జీలకర్ర
- ఎండుమిర్చి
- అల్లం ముక్కలు
- వెల్లుల్లి ముక్కలు
- మెంతులు
- ధనియాల పొడి
- శనగపిండి
- బియ్యం పిండి
- సరిపడా నూనె
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై తయారీ విధానం
ఈ చెట్టినాడ్ చేపల ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న చేపలను వాసన రాకుండా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. కడుక్కునేటప్పుడు అందులో ఎలాంటి నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని.. అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, మెంతులు, ధనియాల పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పు వేసుకొని ఒక తిప్పు తిప్పుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు కొంచెం శనగ పిండి, బియ్యం పిండి తీసుకోవాలి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే ఉప్పు తక్కువగా ఉంటె ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమం మొత్తాన్ని చేపలకు పట్టించాలి. అనంతరం ఆ చేపలను ఒక అరగంట పాటు మ్యారినేట్ అయ్యే విధంగా ఉంచుకోవాలి.
మ్యారినేట్ అయ్యాకా.. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై అయ్యేందుకు సరిపడా నూనెను కూడా వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక్కో చేపలను తీసుకొని రెండు వైపులా ఎర్రగా కాలే విధంగా ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువైతే మాడిపోయే ప్రమాదముంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఫ్రై అయ్యాక కడాయి నుంచి కిందకు తీసుకొని, వాటిపై కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చల్లుకుంటే వేడి వేడి చెట్టినాడ్ ఫిష్ ఫ్రై సిద్ధమైనట్లే. దాన్ని లంచ్, డిన్నర్ లేదా మంచింగ్‌లో కూడా వినియోంగించుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications